ఆహా..పోహా!
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా అటుకుల దోశ, మధ్యాహ్నం సాంబారు అన్నానికి కాంబినేషన్‌గా అటుకుల వడ, సాయంత్రం స్నాక్స్‌గా అటుకుల మిక్చర్.. పండుగల సమయంలో పాయసం, ఫలహారంగా పులిహోర.. ఆ జాబితా పెద్దదే. సంప్రదాయ చిరుతిండిగా సుపరిచితమైన అటుకులతో తీపి, కారం అన్న తేడాలేకుండా రకరకాల వంటలు చేసుకోవచ్చు
ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా అటుకుల దోశ, మధ్యాహ్నం సాంబారు అన్నానికి కాంబినేషన్‌గా అటుకుల వడ, సాయంత్రం స్నాక్స్‌గా అటుకుల మిక్చర్.. పండుగల సమయంలో పాయసం, ఫలహారంగా పులిహోర.. ఆ జాబితా పెద్దదే. సంప్రదాయ చిరుతిండిగా సుపరిచితమైన అటుకులతో తీపి, కారం అన్న తేడాలేకుండా రకరకాల వంటలు చేసుకోవచ్చు. ఇదో బలవర్ధకమైన ఆహారం కూడా (నేడు పోహా డే).
అటుకులను వడ్ల నుంచి తయారు చేస్తారు. వీటిలో కార్బొహైడ్రేట్లు పుష్కలం. తరచూ తినడం వల్ల శరీరానికి విటమిన్-ఎ, బి6, బి12, సి, డి, ఇ, కె అందుతాయి. అంతేకాదు సోడియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం, పాస్ఫరస్ వంటి మూలకాలు కూడా ఇందులో ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను కరిగించే యాంటీ ఆక్సిడెంట్లను అధిక మొత్తంలో కలిగిన ఆహారం ఇది. అటుకులు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. తిన్న తర్వాత నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలోకి విడుదల అవుతుంది.
ఫైబర్ అధికంగా ఉంటుంది. చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం. అందువల్ల చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నిరభ్యంతరంగా ఆరగించవచ్చు. ఇవి రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు బలాన్నిచ్చే ఫలహారం. బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహులు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచిది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఔషధంలా పని చేస్తాయి. అటుకులతో స్నాక్స్, స్వీట్స్‌తో పాటు పులిహోర, దద్దోజనం, ఉప్మా, పాయసం, లడ్డు వంటి ఎన్నో సంప్రదాయ వంటలను చేసుకోవచ్చు. దోశ, ఇడ్లీ పిండి బాగా పులియడానికి వీటిని జోడిస్తారు. అటుకుల ప్రియులందరికీ.. పోహా డే శుభాకాంక్షలు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health benefits
- Poha
- recipes
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

