ఫోన్ మారుస్తున్నారా?
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నది. సరికొత్త ఫీచర్లతో వారానికొక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నది. కొత్తఫోన్ల మోజులో పడి.. పాత ఫోన్లోని విలువైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్నది. సరికొత్త ఫీచర్లతో వారానికొక స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నది. కొత్తఫోన్ల మోజులో పడి.. పాత ఫోన్లోని విలువైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. దీంతో ఇమేజ్‌లు, వీడియోలు, కీలకమైన డాక్యుమెంట్లు, కాంటాక్ట్‌లు పడరాని చేతుల్లో పడుతున్నాయి. సైబర్ నేరాలకు ఊతమిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
- ముందుగా మీ పాత ఫోన్లోని డేటాను భద్రపరుచుకోవాలి. స్టోరేజీ సమస్య ఉంటే అనవసరమైనవన్నీ డిలీట్ చేసి, మిగిలిన డేటాను బ్యాకప్ చేస్తే సరిపోతుంది. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లో క్లౌడ్‌స్టోరేజ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్ యూజర్స్ ‘ఐక్లౌడ్’లో డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు.
- వాట్సాప్‌లోని డేటానూ బ్యాకప్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో సెట్టింగ్స్ – చాట్- చాట్ బ్యాకప్‌పై క్లిక్ చేస్తే మీ డేటా గూగుల్ డ్రైవ్‌లో సురక్షితంగా ఉంటుంది.
- పాత ఫోన్లో మీరు వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, మెసేంజర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్.. బ్యాంకింగ్ యాప్స్ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఇతర అప్లికేషన్ల నుంచి ‘లాగ్ అవుట్’ కావడం మర్చిపోవద్దు. చివరిగా జీమెయిల్ నుంచి కూడా లాగ్ అవుట్ అవ్వాలి. తర్వాత కొత్త ఫోన్లో వాటిని ఇన్స్టాల్ చేసుకొని పాత పాస్వర్డ్తోనే ఉపయోగించుకోవచ్చు.
- అన్ని యాప్స్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమనిపిస్తే.. థర్డ్‌పార్టీ పాస్వర్డ్ మేనేజర్ యాప్‌ల సాయం తీసుకోవచ్చు.
- స్పీకర్, స్మార్ట్‌వాచ్ వంటివి పాత ఫోన్‌తో అనుసంధానమై ఉంటే.. డివైజ్‌లను ‘అన్‌పెయిర్’ చేయాలి.
- ఇవన్నీ చేసిన తర్వాత చివరగా ‘రిస్టోర్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్’లో మీ ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మీ పాత ఫోన్ ఫార్మాట్ అవుతుంది. డేటా అంతా మాయం అవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Information
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

