Panchangam | ఈ తెలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండబోతున్నది
Panchangam | ఆవిర్భావ చక్రం ప్రకారం తెలంగాణ ఆవిర్భావం గురు మహర్దశలో జరిగింది. గురుడి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోరాష్ట్రం ఏర్పాటైంది. లగ్నాధిపతి భాగ్యంలో, ధన-లాభాధిపతి ఐదింట, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం, ఈ సంవత్సరం గోచారరీత్యా భాగ్యస్థానంలోకి గురువు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ప్రభావంతో నాయకులు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపడతారు. అయితే, శని ప్రభావం మూలంగా కొన్ని చికాకులు తలెత్తవచ్చు. అయినప్పటికీ, సామాన్య జనానికి ఉపయుక్తమైన అనేక పథకాలు అమలు చేస్తారు. సంక్షేమం, అభివృద్ధి రెండిటినీ సమర్థంగా నిర్వహిస్తారు.

వర్ష లగ్నం (వర్షారంభం)
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి 2-04-2022 ఉ 11-55 మిథున లగ్నంలో ప్రవేశిస్తున్నది. లగ్న చతుర్థాధిపతి దశమ కేంద్రంలో ధనాధిపతితో కలిసి ఉండటం వల్ల అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు అనుకూలంగా కురిసి, రైతులు సంతోషంగా ఉంటారు. ఈశాన్య ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరస్పర విరోధాలు, అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు, చొరబాటులు ఉంటాయి. ఉత్తర ప్రాంతంలో సస్యానుకూల వర్షాలతో సుభిక్షం నెలకొంటుంది. ధాన్యాదుల ఉత్పత్తి అనుకూలంగా ఉండటంతో ధరలు నిలిచి ఉంటాయి. తూర్పు ప్రాంతంలో వర్షాభావ సూచనలున్నా.. సమయానికి చెదురు మదురు వర్షాలు పడటంతో పంటలు అనుకూలంగా ఉంటాయి.
జగల్లగ్నం (మేష సంక్రమణం):
14-04-2022 ఉదయం 8-45 గంటలకు వృషభ లగ్నంలో మేష సంక్రమణం జరిగింది. లగ్న షష్ఠమాధిపతి మిత్ర క్షేత్రమైన దశమ స్థానంలో ఉండటం, ధన-పంచమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండటం శుభ సూచకం. భాగ్య, రాజ్యాధిపతి భాగ్యంలో ఉండటం సంవత్సర ప్రారంభం నుంచి రాజకీయంగా సుస్థిరత ఉన్ననూ, ఇరుగు పొరుగు దేశాలతో ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారపరంగా ఆటంకాలు ఏర్పడతాయి. అయితే, దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ద్వాదశంలో రాహువు స్థితి మూలంగా దేశం అనవసర ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మిత్ర దేశాలతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార లావాదేవీల మూలంగా ఆదాయం పెరిగి, ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. యువకులకు, విద్యాధికులకు క్షేమకరమైన పథకాలను ప్రకటించడంతో, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి.
దేశారిష్ట యోగాలు
సంవత్సర ప్రారంభం 2-04-2022 నుంచి 12-04-2022 వరకు కాలసర్ప యోగం ఉన్నది. దీని ప్రభావంతో ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, దేశాధినేతల మధ్య అభిప్రాయ భేదాలు, రాష్ట్రాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. 14-04-2022 నుంచి 28-04-2022 వరకు, 12-07-2022 నుంచి 17-01-2023 వరకు గురు, శని పరస్పరం ఏకాదశ త్రికముల స్థితి వల్ల ఈతి, రోగ భయాలు ప్రబలుతాయి. 13-11-2022 నుంచి 11-01-2023 వరకు వక్ర రీత్యా కుజ సంచారం వలన పశువులకు ముఖ్యంగా ఆవులు, గేదెలు, వన్యప్రాణులు, ఏనుగులు, సింహాలు మొదలగు జంతువులకు ఇబ్బందులు ఏర్పడతాయి. 27-06-2022 నుంచి 10-08-2022 వరకు కుజుడు, రాహువు కలయిక వలన అంగ, వంగ, కళింగ ప్రాంతాలకు వర్షాభావ సూచనలతో పంటలకు నష్టం, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఏర్పడవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

