జంతువుల్లోనూ ఒబెసిటీ
పెంపుడు జంతువులు ఎప్పుడూ ఇంట్లోనే, శారీరక శ్రమకు దూరంగా ఉంటాయి. అదే సమయంలో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం అందించడం వల్ల.. బరువు ఎక్కువగా పెరుగుతాయి. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలకు గురవుతాయి. అధిక బరువు.. వాటి జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. జీవితకాలాన్నీ తగ్గిస్తుంది.
పెంపుడు జంతువులపై చూపే అతిప్రేమే.. వాటికి శాపంగా మారుతున్నది. ఎక్కువ ఆహారం అందించడం వల్ల.. కుక్కలు, పిల్లులను ఒబెసిటీ పట్టిపీడిస్తున్నది. వాటి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నది.
పెంపుడు జంతువులు ఎప్పుడూ ఇంట్లోనే, శారీరక శ్రమకు దూరంగా ఉంటాయి. అదే సమయంలో ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం అందించడం వల్ల.. బరువు ఎక్కువగా పెరుగుతాయి. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలకు గురవుతాయి. అధిక బరువు.. వాటి జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. జీవితకాలాన్నీ తగ్గిస్తుంది. బరువు పెరగడం వల్ల వాటి కాళ్లు, కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల నడవడం, ఎగరడం కష్టంగా మారి.. కీళ్ల నొప్పులు వస్తాయి. ఒబెసిటీ వల్ల పిల్లుల్లో డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో గుండెపై అదనపు భారం పడటం వల్ల త్వరగా అలసిపోతాయి. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడతాయి. కొన్ని జంతువుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి, సరిగ్గా పనిచేయకుండా పోతుంది. అంతేకాకుండా, ఊబకాయం బారిన పడిన జంతువులకు ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి.
అందుకే, ప్రేమతో అయినా.. వాటికి ఎక్కువ ఆహారం పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బౌల్‌తో కొలిచి మాత్రమే ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. ఇక బౌల్లో 24 గంటలూ ఆహారం ఉంచడం మానుకోవాలి. రోజుకు నిర్ణీత సమయాల్లో రెండుమూడు సార్లు మాత్రమే ఆహారం పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం తినే బిస్కెట్లను వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. హ్యూమన్ ఫుడ్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. బదులుగా క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, బరువు తగ్గించే ప్రత్యేకమైన ‘లోకేలరీ ట్రీట్స్’ అందించాలి. పెంపుడు జంతువులు ఎక్కువ బరువు ఉన్నట్లు అనిపిస్తే.. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు తీసుకెళ్లాలి. కుక్కలతో ఫెచ్, పిల్లులతో లేజర్ పాయింటర్ ఆటలు ఆడిస్తే.. క్యాలరీలు త్వరగా కరుగుతాయి. చివరగా.. పెంపుడు జంతువు బరువును ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. అయితే, పెట్స్ డైట్లో మార్పులు చేసేముందు ఒకసారి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే.. హఠాత్తుగా ఆహారం తగ్గించినా వాటి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

