Naughtiest Student | అనగనగా ఓ టీచర్, ఓ విద్యార్థిని. ఆ స్టూడెంట్ అంటే టీచర్‌కు చాలా ఇష్టం. తను చేసే అల్లరి అంటే ఇంకా ఇష్టం. ఆ టీచర్ అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. బడి చదువు పూర్తయ్యాక ఇద్దరూ మళ్లీ కలుసుకోలేదు. కాలం గిర్రున తిరిగింది. పదమూడేండ్లు గడిచిపోయాయి. మళ్లీ ఓ రోజు ఆ అల్లరిపిల్ల ఈ టీచర్ ఇంటి తలుపుతట్టింది. ‘హాయ్ మేడం’ అంటూ పలకరించింది.
ఆ మాటతీరుతో వచ్చిందెవరో ఇట్టే తెలుసుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన విద్యార్థినిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఆ స్టూడెంట్ పేరు అలీషా, టీచర్ పేరు రేవ్స్! 13 ఏండ్ల కిందట వాళ్లిద్దరూ కలిసి దిగిన చిత్తరువు, లేటెస్ట్ ఫొటోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఈ గురుశిష్యుల ఫొటో ఎక్స్‌లో వైరల్ అయింది. తన ఉపాధ్యాయురాలిని ఆదర్శంగా తీసుకున్న అలీషా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు టీచర్ కావడం ఇక్కడి విశేషం.
There is a gap of 13 years between the two pics.
Alisha used to be one of the naughtiest kids in my class. Legend has it that she broke a few teeth of another child in my class because he was annoying her. The other teachers in school warned me about Alisha. She was a fire brand pic.twitter.com/dystYVPthv— Revs 🙂 (@Full_Meals) March 21, 2024