అమితాబ్ మనవరాలు నవ్య నవేలి ఇన్‌స్టా ఫొటోలు చూసి ఆమె అభిమానులు ప్రేమగీతాలు పాడుకుంటున్నారు. కొందరైతే ‘ప్లీజ్! నన్ను పెండ్లి చేసుకుంటావా బేబీ’ అంటూ ముద్దుగా కామెంట్లు చేస్తున్నారు. కారణం.. ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఓ మ్యాచింగ్ ఫొటో. మ్యాచింగ్ అంటే డ్రెస్సు మ్యాచింగ్ అనుకుంటున్నారేమో.. తన నెరిసిన జుట్టుకు తగినట్లుగా చీర మ్యాచింగ్ అది. తెల్ల జుట్టుకు నప్పే లైట్ పింక్ కలర్ చీర కట్టుకొని, క్యూట్‌గా ఉన్న ఫొటోలకు ‘ఎఫ్టీ. మై వైట్ హెయిర్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. అలా ఇన్‌స్టాలో పోస్టు చేసిందో లేదో అభిమానులకు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. రొమాంటిక్ ఎమోజీలతో ప్రేమను కురిపిస్తున్నారు. హగ్ ఎమోజీలతో హత్తుకుంటున్నారు. నవ్య మేనమామ అభిషేక్ బచ్చన్ అయితే, హగ్ ఎమోజీతో తన వాత్సల్యాన్ని చూపారు. చక్కనమ్మ చిక్కినా అందమే, వన్నెల రాణికి నెరిసిన జుట్టూ సింగారమే!