‘నాటు’ఐడియా!

ఒక ఆలోచన.. ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది. కరోనా దెబ్బకు ఉపాధి కరువైన వేళ.. ఆదాయ మార్గాన్ని చూపింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆ ఆటోడ్రైవర్‌ను నాటుకోళ్ల వ్యాపారంలోకి దింపింది. కేవలం రూ. 45 వేల పెట్టుబడితో రూ.లక్షల ఆదాయం పొందేలా చేసింది.
కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన నాగపూరే వికాస్ ఆటో డ్రైవర్. మూడు చక్రాల బండి నడుపుతూ బతుకు బండి లాగించేవాడు. కరోనాతో ఉపాధిని కోల్పోయి ఇంటికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో ‘చికెన్’ తింటే కరోనా దరిచేరదన్న ప్రచారంతో, నాటుకోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ‘నాటుకోళ్ల’ వ్యాపారంలోకి దిగాలని నిర్ణయించుకొన్నాడు. తన ఆటోను అమ్మేసి, రూ.45 వేలతో వెయ్యి నాటు కోడి పిల్లలను కొన్నాడు. తన వ్యవసాయ భూమిలోనే ఫెన్సింగ్ వేసి కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు వాటికి పోషకాహారం అందిస్తూ వచ్చాడు. దీంతో ఆరు నెలల్లోనే ఒక్కో కోడి కిలోకిపైగా బరువు పెరిగింది. మార్కెటింగ్ కోసం ఎక్కడికీ వెళ్లకుండా, తన ఫారం వద్దే అమ్మకాలను ప్రారంభించాడు వికాస్. కిలో కోడి ధర రూ.350. మొదట్లో మందకొడిగా ఉన్నా, రానురానూ గిరాకీ పెరిగింది. వికాస్ పెంచుతున్న నాటుకోళ్లు రుచిగా ఉంటున్నాయనే ప్రచారం రావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలా, నెలలోనే రూ.లక్షకు పైగా రాబడి పొందాడు. ఐడియాలో దమ్ముంటే చాలు.. ఐఎస్బీలో చదవాల్సిన పన్లేదు. ఆంత్రప్రెన్యూర్‌షిప్ ఏ ఒక్కరి అబ్బసొత్తూ కాదు.
… మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- chicken
- natukodi
- wild chicken
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

