కావలసిన పదార్థాలు: మష్రూమ్స్: 100 గ్రా., వెన్న: రెండు టీ స్పూన్లు, కార్న్ ఫ్లోర్: రెండు టీ స్పూన్లు, పాలు: ఒక కప్పు, నీళ్లు: ఒక కప్పు.
తయారీ విధానం: ముందుగా మష్రూమ్స్‌ను బాగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి. కొద్దిగా పాలు, నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఒక ప్యాన్‌లో వెన్న వేడి చేసి కార్న్‌ఫ్లోర్ కొద్దిగా వేపాలి. ఇందులో మిగిలిన పాలు, ఉప్పు, ఉడికించిన మష్రూమ్లను నీళ్లతోపాటు వేసి కలుపుతూ చిక్కబడే వరకు మరిగించి దింపేయాలి. పైన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరి, వేడివేడి మష్రూమ్ సూప్ రెడీ.