మోటో నుంచి మ్యాక్స్ బ్యాటరీతో..
మోటరోలా సరికొత్త మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ ‘మోటో జి మ్యాక్స్'ను అధికారికంగా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ఈ ఫోన్ను తీసుకువచ్చింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేసింది.
మోటరోలా సరికొత్త మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ ‘మోటో జి మ్యాక్స్’ను అధికారికంగా లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ఈ ఫోన్ను తీసుకువచ్చింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేసింది. దీనికి గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ను జోడించింది. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6ఎస్-జెన్4తోపాటు 6జీబీ ర్యామ్ ఉండటం వల్ల పెర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉండనుంది. కెమెరా విషయానికి వస్తే.. 50 ఎంపీ సోనీ ఎల్వైటీ ప్రైమరీ కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్ను ఏర్పాటు చేసింది.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 32 ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్లోని మెయిన్ ఫీచర్.. 7,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల భారీ బ్యాటరీ. సాధారణ వాడకంతో మూడు రోజుల వరకూ బ్యాకప్ అందిస్తుందని సంస్థ చెబుతున్నది. ఇక చార్జింగ్ కోసం 33W వరకూ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, ఐపీ 64 డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల.. అన్ని వాతావరణ పరిస్థితులనూ తట్టుకుంటుంది. 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.27,999గా నిర్ణయించింది. మోటరోలా అధికారిక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్తోపాటు అన్ని ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉన్నది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

