మీ ఆరోగ్యాన్ని..‘మునగ’నివ్వదు!

ప్రస్తుత పరిస్థితుల్లో మునగాకును ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. మునగలోని ఐరన్, మెగ్నీషియం తక్షణ శక్తినిస్తాయి. మునగలో పాలలో కంటే నాలుగు రెట్లు క్యాల్షియం, రెండు రెట్లు ప్రొటీన్ ఉంటాయి. విటమిన్-సి నారింజలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ. విటమిన్-ఎ క్యారెట్లలో కంటే ఐదురెట్లు అధికం. మునగాకుతో పచ్చడి, స్మూతీ, జ్యూస్, పప్పు వండుకోవచ్చు. సూప్, పరాటాల తయారీలోనూ వాడొచ్చు. అయితే వీటిని ఉదయం మాత్రమే తినాలని, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వర్కవుట్స్‌కి ముందు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మునగాకు, గింజలు, వేర్లు .. ఇలా మునగ చెట్టులో ఒక్కో భాగం ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తుంది. మునగాకు ఆస్తమా, ఫ్లూ, గుండెలో మంట, చర్మ వ్యాధులు, బ్రాంకైటిస్, కన్ను-చెవి ఇన్ఫెక్షన్లు, హై బీపీ వంటి సమస్యల బారినపడకుండా కాపాడుతాయి. మునగ గింజలు హైపర్ థైరాయిడిజం, ఆర్థరైటిస్, ఎపిలెప్సీ సమస్యలకు చెక్ పెడతాయి. వేర్లు, బెరడు గుండెకు బలాన్నిస్తాయి. మునగ పువ్వులు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. యూరినరీ సమస్యలను, జలుబును తగ్గిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

