వెదర్ ‘యాప్’డేట్స్

మబ్బులు పట్టిన ఆకాశం, పచ్చదనం పరుచుకున్న నేలతల్లి, జలధారలతో ఉప్పొంగుతున్న కొండకోనలు పర్యాటక పర్వానికి తెరదీశాయి. చిరుజల్లులు స్వాగత గీతాలు పాడుతున్న వేళ విహారానికి సిద్ధమవుతున్నారా! అయితే, ఒక్క నిమిషం ఆగండి. ప్రయాణానికి ముందు పర్యాటక కేంద్రంలో వాతావరణ పరిస్థితులు తెలుసుకోండి. నింగికి చిల్లు పడ్డట్టుగా కుండపోత వర్షం రావచ్చు, చిరుజల్లులు పడతాయనే ఆశతో అంతదూరం వెళ్తే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ఈ వెదర్యాప్స్ తోడుంటే.. ఆ సంగతులన్నీ తెలుసుకొన్నాకే విహారానికి శ్రీకారం చుట్టొచ్చు.
మౌసమ్ భారతీయ వాతా
వరణ శాఖ ప్రత్యేకించి రూపొందించిన యాప్ ఇది. కచ్చితత్వంతో కూడిన వాతావరణ వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. దేశం నలుమూలలా ఏ ప్రదేశానికి చెందిన వెదర్ అప్డేట్స్ అయినా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందస్తుగానే తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్ష సూచనలను చేస్తుంది. రానున్న రోజుల్లో వాతావరణంలో జరిగే మార్పులను సూచిస్తూ ఉపగ్రహ చిత్రాలను కూడా ఇందులో చూడొచ్చు.
స్కైమేట్ వెదర్
వాతావరణ వివరాలు కచ్చితంగా తెలియజేసే యాప్ ఇది. రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకింది మొదలు వర్షాల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న వాతావరణ కేంద్రాల నుంచి వివరాలను క్రోడీకరించి రానున్న రెండు వారాల సమాచారాన్ని అందజేస్తుంది. రియల్‌టైమ్ టెంపరేచర్ కూడా
తెలుసుకోవచ్చు.
ఆక్యూవెదర్
దేశంలోని ప్రధాన నగరాల వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రానున్న 45 రోజుల్లో వాతావరణ పరిస్థితులను అప్డేట్ చేస్తుంది. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు, వర్షపాత వివరాలు చూడొచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

