బరువు తక్కువ బిడ్డలు!

తల్లి పోషకాహార లోపాలతోనో, అనారోగ్యంతోనో బాధపడుతుంటే.. పుట్టబోయే శిశువు నిండుగా తొమ్మిది నెలలు గర్భంలో ఉన్నా సరే, పెరుగుదల లోపిస్తుంది. తక్కువ బరువుతోనే జన్మిస్తుంది. సాధారణ బరువుతో జన్మించిన పిల్లలతో పోలిస్తే.. ఏడాది దాటేలోపు మరణించే ఆస్కారమూ ఎక్కువని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
నెలలు నిండినా, బరువు తక్కువగా పుట్టిన శిశువులలో 3 రకాలు..
- పొడవు సరిగ్గా ఉన్నా, బరువు తక్కువ
శరీరంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చర్మం వదులుగా, వేలాడుతున్నట్టు ఉంటుంది. స్థన్యం ఇచ్చే తల్లి సరైన పోషకాహారం తీసుకొంటేనే.. శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. నిండు చూలాలికి పోషకాహారలోపం ఇంకా ప్రమాదకరం. - పొడవు, బరువు రెండూ తక్కువ
గర్భం ప్రథమ దశలో ఉన్నప్పుడు తల్లికి అంటువ్యాధులు సోకినా, ఆ తల్లికి జన్యుపరమైన లోపాలు ఉన్నా శిశువు పొడవు, బరువు.. రెండూ తక్కువగా ఉంటాయి. - మిశ్రమం
పిండంపై దుష్ప్రభావం అన్ని దశల్లోనూ ఉంటుంది. శిశువు చాలా చిన్నగా, సన్నగా ఉంటుంది.
తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు భవిష్యత్తులో రక్తపోటు, మధుమేహం వచ్చే ఆస్కారం ఎక్కువ. గర్భధారణకు ముందు స్త్రీ బరువు 40 కిలోల కంటే తక్కువ ఉన్నా, ఎత్తు 145 సెంటీ మీటర్ల కన్నా తక్కువ ఉన్నా, బరువు తక్కువ శిశువు జన్మించే ఆస్కారం ఎక్కువ.
గర్భధారణ సమయంలో కనీసం 7 కిలోల బరువు పెరగకపోయినా, బరువు తక్కువ శిశువులు జన్మించే ప్రమాదం అధికం. గర్భిణికి సరైన ఆహారం ఇవ్వడం ద్వారా బరువు తక్కువ శిశు జననాలను సగానికిసగం నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- babies
- Low weight
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

