షాజహాన్-ముంతాజ్ ప్రేమకథ చారిత్రక నిర్మాణమైంది. సలీం-అనార్కలీ వలపు గాథ విషాదాంత కావ్యమైంది. ఒకటా రెండా.. మొఘల్ చక్రవర్తుల వంశవృక్షంలో ఎన్నో ప్రేమ మొక్కలు. ఓ ప్రణయ ఘట్టం మాత్రం.. నిశ్శబ్దంగా ముగిసిపోయింది. నాయిక పేరు జహాన్ అరా. షాజహాన్ పెద్ద కూతురు. చక్రవర్తికి తనంటే అపారమైన ప్రేమ. ఆ సమయానికి మొఘల్ దర్బారులో ఓ బ్రిటిష్ రాయబారి ఉండేవాడు. అతని పేరు నికొలస్ వాలెంటైన్. అందగాడు. మాటకారి. ఏదో సందర్భంలో ఇద్దరి చూపులు కలిశాయి. ఆపై మనసులూ కలిశాయి.
ప్రేమ చిగురించింది. లేఖలు కూడా రాసుకున్నారు. ఆ విషయం షాజహాన్ చక్రవర్తికి తెలిసింది. కూతురిపై కన్నెర్ర జేశాడు. అంతఃపురంలో బందీని చేశాడు. నికొలస్కూ హెచ్చరికలు వెళ్లాయి. దీంతో మనసు చంపుకొని.. ఓడ ఎక్కాడు. ఆ సమయానికి.. అతని మనసే కాదు, సముద్రమూ అల్లకల్లోలమే. తదుపరి కాలంలో జహాన్ అరా.. మొఘల్ సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతురాలైన మహిళగా ఎదిగింది.