ఫోన్ హ్యాండ్ తగ్గేదెలా?!
గంటల తరబడి స్రోలింగ్, టైపింగ్... చేతిలో ఫోన్ ఉంటే అందరిదీ ఇదే పని! స్మార్ట్‌ఫోన్‌లో గంటలకొద్దీ మునిగిపోవడం వల్ల మెంటల్ హెల్త్‌కు మాత్రమే కాకుండా శారీరక సమస్యలూ ఎదురవుతాయి. ఫోన్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల వచ్చే పునరావృత ఒత్తిడిని వైద్య పరిభాషలో ‘ఫోన్ హ్యాండ్' అని పిలుస్తున్నారు.
గంటల తరబడి స్రోలింగ్, టైపింగ్… చేతిలో ఫోన్ ఉంటే అందరిదీ ఇదే పని! స్మార్ట్‌ఫోన్‌లో గంటలకొద్దీ మునిగిపోవడం వల్ల మెంటల్ హెల్త్‌కు మాత్రమే కాకుండా శారీరక సమస్యలూ ఎదురవుతాయి. ఫోన్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల వచ్చే పునరావృత ఒత్తిడిని వైద్య పరిభాషలో ‘ఫోన్ హ్యాండ్’ అని పిలుస్తున్నారు. ఒకే చేతితో ఫోన్‌ను పట్టుకుని వేలితో గంటల తరబడి స్రోల్ చేయడం వల్ల కండరాలు, నరాలు, కీళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. మణికట్టును వింత కోణాల్లో ఉంచి ఫోన్‌ను పట్టుకోవడం వల్ల నాడులపై ఒత్తిడి పెరిగి, వాపు, నొప్పి, చేతి పనితీరు తగ్గడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా… బొటనవేలు మొదట్లో తీవ్రమైన నొప్పి రావడం, చేతిలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, మణికట్టు చుట్టూ వాపు, నరాల్లో మంట పుట్టడం, వేళ్లు పట్టు కోల్పోవడం తదితర సమస్యల బారిన పడే ప్రమాదముంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోండి. ఈ జబ్బును పూర్తిగా దూరం చేయాలంటే స్మార్ట్‌ఫోన్ అలవాట్లను మార్చుకోవడమే పరిష్కారం. ఆ మార్పులో భాగంగా.. ఫోన్‌ని వినియోగిస్తున్నప్పుడు ప్రతి 20-30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. ఒక చేత్తో కాకుండా, రెండు చేతుల సాయంతో ఫోన్‌ను హ్యాండిల్ చేయాలి. మణికట్టును వీలైనంత సహజ స్థితిలో ఉంచాలి. స్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. టెక్ట్సింగ్‌కు బదులు వాయిస్ టూ టెక్ట్స్ ఫీచర్ వాడటం మంచిది. రోజూ చేతులు, మణికట్టుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మేలు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

