మన దేశంలో ఆదివారం ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో మాంసాహార ప్రియులకు కొరత లేదు. అయితే కొందరు వెరైటీ కోసం చికెన్, మటన్ రెండిటినీ ఒకేరోజు తెచ్చుకుంటారు. కొందరైతే ఈ రెండిటినీ కలిపి ఒకే కూరగా వండే ప్రయోగాలు కూడా చేస్తుంటారు. మరి ఇలా చికెన్, మటన్ కలిపి వండటం లేదా ఒకేసారి కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు ఈ అభిరుచిపై ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
సాంకేతికంగా చికెన్, మటన్‌లను కలిపి వండడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ రెండు రకాల మాంసాలు ఉడికే సమయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చికెన్ చాలా త్వరగా, సులభంగా ఉడికిపోతుంది. కానీ మటన్ గట్టిగా ఉండటం వల్ల అది పూర్తిగా ఉడకడానికి ఎకువ సమయం పడుతుంది. రెండిటినీ కలిపి ఒకేసారి వండితే, మటన్ ఉడికే సరికి చికెన్ ముకలు పూర్తిగా మెత్తగా అయిపోయి, విడిపోయి గుజ్జులా మారిపోతాయి. ఒకవేళ చికెన్ ఉడికిన వెంటనే దించేస్తే మటన్ పచ్చిగా ఉండిపోతుంది. పచ్చి మాంసం తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్య పరంగా చికెన్ వైట్ మీట్ కిందకు వస్తుంది, మటన్ రెడ్ మీట్ కోవలోకి వస్తుంది. చికెన్ తేలికగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది. కానీ, మటన్‌లో కొవ్వు, ప్రొటీన్ల శాతం ఎకువగా ఉండడం వల్ల అది జీర్ణం కావడానికి చాలా ఎకువ సమయం పడుతుంది. ఈ రెండిటినీ ఒకేసారి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. రెండు రకాల మాంసాలను కలిపి తిన్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీ మొత్తంలో ప్రొటీన్లు, కొవ్వు అందుతాయి. శరీరం ఒకేసారి ఇంత భారీ మోతాదులో పోషకాలను శోషించుకోలేదు. ఫలితంగా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే చికెన్, మటన్‌లను కలిపి వండకుండా, విడివిడిగా వండుకుని వేర్వేరు సమయాల్లో తినడం ఉత్తమం. కాగా, మన దేశ ప్రజలు మటన్ కంటే చికెన్‌ను చాలా ఎకువగా ఇష్టపడుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో చికెన్ ధర తకువగా ఉండటం, సులభంగా లభించడం, ఆరోగ్యపరంగా లీన్ ప్రొటీన్ కలిగి ఉండే కారణాలతో పాటు… రెడ్ మీట్ ధరలు అధికంగా ఉండటం, అది జీర్ణం కావడానికి ఎకువ సమయం పడుతుండటం వల్ల చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. చికెన్, మటన్ కలిపి తినడం వల్ల తక్షణమే ప్రాణాంతక సమస్యలు రాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో ఇది జీర్ణక్రియను మందగించేలా చేస్తుందని అనేక రకాల ఆరోగ్య సంస్థలూ హెచ్చరిస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటిని విడివిడిగా, తగిన పరిమితిలో ఆస్వాదించడమే సురక్షితమైన మార్గం.