‘ఆధునిక’ సంప్రదాయం!

వేడుకల్లో సంప్రదాయ దుస్తుల హవా మామూలుగా ఉండదు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ నిండైన దుస్తులతో పొందికగా తయారవుతారు. ప్రస్తుతం వేడుకలంటే చాలు, రకరకాల డిజైన్లలో లెహంగాలే దర్శనమిస్తున్నాయి. పట్టుచీరలు, పట్టు పరికిణీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఆధునిక యువతుల మనసు దోచేస్తున్న లెహంగాల డిజైన్లు..
వెల్వెట్ మెరుపులు
పీచ్ కలర్ బేస్‌తో ఉన్న ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్‌పై మల్టీకలర్ ప్రింట్స్ ఉన్న ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగా ఇది. మూడు డిజైన్ల బార్డర్ దీనికి స్పెషల్ లుక్ ఇస్తున్నది. పీచ్ కలర్‌కి పింక్, గ్రీన్ కాంబినేషన్ హైలైట్ అయ్యింది. బార్డర్లో ఉన్న కలర్లు తేలిపోకుండా పింక్ లెహంగా ఇచ్చారు. లెహంగాకి నప్పేలా గ్రీన్ కలర్ టాప్ జోడించారు. ప్లెయిన్ అయినా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో హాఫ్ హ్యాండ్స్, పీటర్ ప్యాన్ కాలర్ నెక్ ఇవ్వడంతో ట్రెండీగా ఉంది.
గులాబీ జతగా…
పింక్ కలర్ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహంగా ఇది. మొత్తం పింక్
కలర్‌పై బంగారు వన్నె బుటా ఉన్న ఒకే ఫ్యాబ్రిక్‌తో ఇచ్చి కాంబినేషన్లో వెయిస్ట్ కోట్ ఇచ్చారు. లెహంగా కలర్‌కి నప్పేలా ఫ్లోరల్ ప్రింట్ గార్జెట్ ఫ్యాబ్రిక్‌తో ఫుల్ చుడీ హ్యాండ్స్ టాప్ రూపొందించారు. టాప్‌ని హైలైట్ చేసేలా రౌండ్‌నెక్ డిజైన్‌తో ఉన్న వెయిస్ట్ కోట్కి డోరీ స్టాసిల్స్ను జత చేయడంతో లుక్ అదిరిపోయింది. పూజలు, వ్రతాల వంటి సంప్రదాయ వేడుకలకు ఈ లెహంగా చక్కగా నప్పుతుంది.
డిజైనర్ అండ్ మోడల్: రితీషా రెడ్డి
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/
riteshareddy, 70136 39335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

