వాళ్లంతా జెన్-జీ యూత్. అలాగని పొద్దంతా స్మార్ట్ఫోన్లనే చూస్తూ కాలం గడిపే టైప్ కాదు. అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దేశ భవిష్యత్‌కు పునాదులుగా మారే యంగ్తరంగ్స్ వీళ్లు. ‘సోషల్ కాజ్’ ఏదైనా సరే ‘మేమున్నాం’ అంటూ ముందుంటారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం 45 వేల మంది యువ సైన్యం. 2009 నుంచి 13 లక్షల మందికిపైగా వ్యక్తులకు, వెయ్యికిపైగా జంతుజాలానికి తమవంతుగా ప్రత్యక్ష సేవ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్, ముంబై,చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి 11 మెట్రో సిటీలతో పాటు.. దేశవ్యాప్తంగా విస్తరించి ‘స్ట్రీట్కాజ్’ పేరిట సామాజిక దృక్పథంతో విశేష సేవలందిస్తున్నారు. అవసరమైనచోట్ల భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దుతున్నారు. సమాజానికి అవసరమయ్యే ఆంత్రప్రెన్యూర్స్ అవుతున్నారు. వారు ఉద్యోగాలు చేయడం లేదు.. అవసరమైన వారికి ఉపాధి కల్పిస్తున్నారు. సమాజానికి పరిష్కారాలు కనుగొనే సామాజిక శాస్త్రవేత్తలు అవుతున్నారు.
అటువంటి ఈ యంగిస్థాన్‌లు.. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్‌ను కలిసి.. తమ భావాలు పంచుకున్నారు. కేవలం పదేండ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణపై ఖుల్లంఖుల్లాగా ప్రశ్నలు అడిగి తమ సందేహాలు తీర్చుకున్నారు. సమ సమాజ నిర్మాణానికి పూనుకున్న ఈ నవ సమాజ ప్రతినిధుల తపన చూసిన కేటీఆర్.. జెన్-జీ రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానం పలికారు. ఆ స్ట్రీట్కాజ్ వలంటీర్లు, కేటీఆర్ మధ్య సంభాషణల సమాహారం తెలంగాణ జెన్-జీ కోసం.
నేను పనిచేసే జీసీసీ హెచ్ఆర్ కన్సల్టెంట్‌కు చాలామంది విదేశాల నుంచి వస్తుంటారు. బిల్డింగ్ నుంచి హైదరాబాద్‌ను చూస్తూ.. ‘ఈ నగరం న్యూయార్క్‌లా ఉంది. సిడ్నీలా కనిపిస్తుంద’ని అంటూనే.. ఇంతలా అభివృద్ధి చేసిన వ్యక్తుల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ సంభాషణల్లో వినిపించే పేర్లు కేసీఆర్.. కేటీఆర్. అంతలా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అప్పుడు విత్తనం నాటారు. దగ్గరుండి నీళ్లు పోశారు. ఇప్పుడు ఫలాలు అందుతున్నాయ్.
– ప్రణవ్ (హోస్ట్)
కేటీఆర్: మా ఫ్యామిలీలో నాన్నే మొదటితరం పొలిటీషియన్. ఆయన 22 ఏండ్లకే రాజకీయాల్లోకి వచ్చారు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయకుండా ఎవరూ విజేతలు కాలేరు. నాన్న కూడా అంతే. చాలా సింగిల్ మైండ్ ఫోకస్‌తో పనిచేశారు కాబట్టే.. ఈరోజు వరకూ 12సార్లు ఎన్నికల్లో గెలిచారు. ఆయన మాకు ఎప్పుడూ చెప్పే మాట.. ‘ఏం చేసినా సగం సగం చేయకు.. పూర్తిగా చెయ్’ అనేది. అది మీకూ ఉపయోగపడుతుంది. ఒకర్ని తన ఇంటికి ఆహ్వానిస్తే.. వారికి ఏది ఇష్టమో.. ఏమేం చేయాలో మొత్తం తెలుసుకునేవారు. 10 లక్షల మందితో మీటింగ్ పెట్టినా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టినా అదే ప్రణాళిక ఉంటది. ప్లస్ 2 వరకూ పలుచోట్ల చదివాను. అక్కడి పరిస్థితులను అర్థం, అవగతం చేసుకున్నాను. మన జీవితంలోనూ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఈ అనుభవం ఉపయోగపడుతుంది.

కేటీఆర్: నాకు లెక్కలంటే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు పదో తరగతి అవుతదా? ఎప్పుడు ఈ లెక్కల గోల నుంచి బయటపడదామా? అనే ఆలోచించేది. అప్పుడు నేర్పిన సైన్టీటా, కాస్టీటా, పైథాగరస్ నా లైఫ్‌లో ఉపయోగపడలేదు (యూత్ నవ్వులు). నేను సివిల్ సర్వెంట్ కావాలనేది నాన్న కోరిక. యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, ఐఏఎస్ అవ్వాలని ఆయనకు ఇష్టం. అమ్మనేమో నేను డాక్టర్ కావాలనుకునేది. మనకేమో లెక్కలంటే చిక్కు. అందుకే, టెన్త్ తర్వాత ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, కామర్స్ బుక్స్ నాన్న టేబుల్‌పై పెట్టిన. ఆరోజు నాన్న అడిగితే నాకు హెచ్ఈసీ వంటి గ్రూపులు ఇష్టమని చెప్పి లెక్కల నుంచి తప్పించుకున్న. కళ్యాణ్ అనే ఫ్రెండ్ గుంటూరులోని విజ్ఞాన్‌లో జాయిన్ అయి.. అక్కడ అన్నీ ఉన్నయి అన్నడు. నేను టెంప్ట్ అయ్యా. నాన్నకు చెబితే.. అక్కడ సీట్ ఇప్పించారు. అక్కడ హెచ్ఈసీ, సీఈసీ లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సైన్స్ గ్రూప్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ బాగా చదివి (బట్టీ పట్టి) స్టేట్ 11వ ర్యాంకు సాధించిన. అది గొప్ప విషయం కాదు. ఆ తర్వాత ఎంసెట్‌లో ర్యాంకు రాకపోవడంతో అప్పుడు ‘కే-సెట్’ రాస్తే సీటు వచ్చింది. డాక్టర్ అవుదామని నాన్నకు చెప్తే.. 32 ఏండ్ల వరకూ చదవాలని చెప్పిండు. దాన్ని వదిలేసి.. హైదరాబాద్‌లోనే బీఎస్సీ మైక్రోబయాలజీ చేశాను.
కేటీఆర్: అంతా నార్మల్‌గానే ఉన్నది. ఎందుకంటే మా బాస్ (నాన్న) ఎప్పుడూ రైట్. ఏదైనా విషయంలో ఆయనతో వాదించినా, విభేదించినా.. ఆయన ఏది చెబితే.. మేమంతా కచ్చితంగా అదే చేసేవాళ్లం. మన బాస్ ఇంటెలిజెంట్ అయితే.. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకోవాల్సిందే.
కేటీఆర్: 2015లో వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. నాన్న కాళ్లు మొక్కితే.. ఆయన నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని హగ్ చేసుకున్నారు. అదే మొదటిసారి. ఆ తర్వాత నా పుట్టినరోజుకు మరోసారి ఆలింగనం చేసుకున్నారు. జీవితం క్షణకాలం. మనకు సమయం ఉన్నంత వరకూ తల్లిదండ్రులతో కలిసి ఉండండి. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. అమ్మానాన్నలను హత్తుకోండి. ఎందుకంటే అది ప్రేమను మరింత పెంచుకుంది.
కేటీఆర్: అప్పుడు నాకు సమయం గురించి తెలియక.. ఆ టైమ్ కిల్ చేయడానికే చదువుకునేది. ఆ తర్వాత పెండ్లయింది. ఆమెకు కూడా చెప్పిన యూఎస్‌లో ఉండనని. తను కూడా ఓకే చెప్పింది. 2004లో ఇండియా వచ్చి.. విదేశీ పర్యటనలకు వెళ్లాం. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. తెలంగాణకు నావంతు ఏదైనా చేయాలని. సరిగ్గా అప్పుడే 2006లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి.. నాన్నతో కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నా. అలా రాజకీయాల్లోకి ప్రవేశించాను. తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యాను.

కేటీఆర్: నేను అమెరికాలో సెటిల్ కావాలని అనుకోలేదు. నాకు అక్కడ ఉండాలని కూడా అనిపించేది కాదు. ‘ఇది మా ఊరు కాదు.. మా కంట్రీ కాద’నే ఫీలింగే ఉండేది. ఇండియాకు వచ్చాక రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉందని అమ్మానాన్నతోపాటు నా భార్య శైలిమకు చెబితే వాళ్లు రకరకాలుగా స్పందించారు. ‘వెయిట్.. తొందరేముంది?’ అని నాన్న చెప్పినా వినకుండా 2006కు ముందే ఉద్యోగం వదిలేసి వచ్చిన. నా తండ్రి ఆశయం కోసం పోరాడాలనిపించింది. ప్రజల కోసం తీసుకున్న నిర్ణయంగానే దానిని భావించా.
కేటీఆర్: ఎవరో ఒక వ్యక్తికి, నాయకుడికి దక్కే క్రెడిట్ కాదు హైదరాబాద్ అభివృద్ధి అంటే. 1591లో ఈ సిటీ పుట్టింది. 435 ఏండ్ల చరిత్ర ఉన్నది. సోల్ ఆఫ్ ద సిటీస్ అంటే ఆయా నగరాల సంస్కృతి, హెరిటేజ్, ప్రజలు, ఆహారం, ఆహార్యం వంటివి అన్నీ కలిసి ఉంటాయి. ఇవాళ హైదరాబాద్ అంటే ఎన్నో సంస్కృతుల కలయిక. హైదరాబాద్ పురోగతిలో చిన్న కాంట్రిబ్యూషన్ నాది కూడా ఉండొచ్చు. నావల్లే ఇదంతా అని ఎవరైనా చెబితే అది తప్పయితది. లిమిటెడ్ కెపాసిటీలో చేసేది చేశాం. కానీ మౌలిక వసతుల కల్పన, ఐటీ మార్కెటింగ్ కసితో చేసినం. సమయం కేటాయించినం. ఎందుకంటే సెపరేట్ స్టేట్ కోసం కొట్లాడినోళ్లం. స్టేట్ తెచ్చినోళ్లం కాబట్టి మనమేంటో ప్రపంచానికి చూపాలనుకున్నాం. కసితో పనిచేశాం. తెలంగాణను జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ వన్‌గా అభివృద్ధి చేసినం. 8 ఏండ్లలోనే ఇవన్నీ సాధించినం. ఈ అద్భుత పురోగతి సాధనకు కేసీఆర్ ముందుచూపు, పాలనా పటిమ కలిసి వచ్చింది.
మిషన్ భగీరథ పథకం కింద ప్రతి ఆవాసానికి, తండాలకు నల్లాలు పెట్టి మంచినీరు అందించినం. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను నివారించినం. అక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూసినప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అదే పద్ధతిలో మీలాంటి స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కూడా మానవీయ కోణంలో ఆలోచించాలి.
కేటీఆర్: 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. మొదటి రోజు నుంచే నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నా. అదే రోజు కొందరితో కూర్చొని టెక్నాలజీని ఎలా ముందుకు తీసుకెళ్దాం అని అడిగా. రెండో రోజు ఐఎస్బీ, ట్రిపుల్ ఐటీకి వెళ్లినం. అప్పుడు అన్నిట్లో బెంగళూరుతో పోటీ ఉన్నది. ఇక్కడ ఎకో సిస్టం మార్చాలనుకున్నాం. దేశంలోనే పెద్ద ఇంక్యుబేటర్ పెట్టాలని, మొదటి దశ టీ హబ్‌కు అడుగులు వేశాం. ‘క్యాటలిస్ట్’ అని పేరు పెట్టి రతన్ టాటాతో ప్రారంభించాలనుకున్నాం. ఆయన డేట్ కోసం మూడు నెలలు ఆగాం. ఎంతోమంది పారిశ్రామికవేత్తలను మెంటార్స్‌గా ఎంపిక చేసుకున్నాం. స్కైరూట్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి నిన్న మొన్న రేవంత్‌రెడ్డి వెళ్లారు. ఇది టీ హబ్ నుంచి వచ్చిందే. ఇండియాలోనే మొదటి శాటిలైట్ కంపెనీ కూడా టీ హబ్ నుంచే వచ్చింది. మేం నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలై ఫలాలనిస్తున్నాయి. ఇది చాలా సంతోషంగా ఉన్నది.

కేటీఆర్: ఏఐతో కలిగే పరిణామాల గురించి నేను వివిధ రంగాల నిపుణులతో మాట్లాడిన. ఇటీవల ఒక ఫార్మా లీడర్‌ను కలిసిన సందర్భంలో ఏఐ ప్రభావం ఫార్మారంగంలో ఏవిధంగా ఉన్నదని అడిగితే.. వచ్చే నాలుగేండ్లలో 10 శాతం వర్క్పవర్ తొలగించాల్సి వస్తుందన్నరు. కంపెనీలకు లాభాలపరంగా చూస్తే ఇది కరెక్టే అనిపిస్తున్నది. కానీ, మానవీయ కోణంలో పరిశీలిస్తే భయపడాల్సి వస్తున్నది. ఏఐ ఎఫెక్ట్ ఏరోస్పేస్ నుంచి అగ్రికల్చర్ దాకా వచ్చింది. ఏఐతో కొత్త జాబ్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏఐ స్కిల్స్‌పై పట్టు సాధించాలి.
కేటీఆర్: ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోతే లైఫ్ సెటిల్ అవుతుందనే దాంట్లో ఎంతమాత్రం వాస్తవంలేదు. నాది న్యూస్ పేపర్ చదివే జనరేషన్. న్యూస్ పేపర్ తెరిస్తే ఐదురకాల మనుషులు కనిపిస్తారు. బ్యాక్ పేజీలో స్పోర్ట్ స్టార్లు (వైభవ్, విరాట్, టెండూల్కర్) కనిపిస్తారు. కానీ, స్పోర్ట్ స్టార్ కావాలంటే హార్డ్‌వర్క్ చేయాలి. టాలెంట్ ఉండాలి. కలిసిరావాలి. ఆ తర్వాతి పేజీలో కనిపించే సినిమా స్టార్లు కావాలంటే కూడా ప్రతిభ ఉండాలె. ఆ తర్వాత ఇంకో పేజీ బిజినెస్‌లో అంబానీలు, అదానీలు, ఇప్పుడు స్టార్టప్‌లు స్థాపించిన మీలాంటి వాళ్లు కనిపిస్తారు. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేరు. మరోపేజీలో క్రైమ్ ఇందులో క్రిమినల్స్ ఉంటారు. కానీ ఫస్ట్ పేజీలో కనిపించే పొలిటీషియన్లు కావడం చాలా ఈజీ. ప్రతి ప్రొఫెషన్లలో మంచీ చెడూ కోణాలుంటాయి. బయటివారు చూసినంతగా పొలిటికల్ ఫీల్డ్ గ్లామర్ కాదు. అనేక ఇబ్బందులు ఉంటాయి. అయినా భవిష్యత్ కోసం జెన్-జీ రాజకీయాల్లోకి రావాలి.
కేటీఆర్: ఇది తప్పు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ సైరన్ వినియోగించలేదు. అయినా హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కుల్లో ఇదంతా సాధ్యంకాదు. అంబులెన్స్‌లకే ఎవరూ పక్కకు పోరూ. పొలిటీషియన్లను ఎవరు పట్టించుకుంటరు?
కేటీఆర్: అవును.. సినిమాల కంటే ఇందులోనే డ్రామాలు ఎక్కువగా ఉంటయ్. కానీ, ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ప్రతిచోటా పాలిటిక్స్ కనిపిస్తయి. ఆఫీసులు, కాలేజీలు, ఇండ్లల్లో కూడా ఉంటాయి. నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్‌లోనే పాలిటిక్స్ తక్కువ. రాజకీయాల్లో రసవత్తరమైన ఘట్టాలు ఉంటాయి. రక్తికట్టే డ్రామాలు నడుస్తయ్.
కేటీఆర్: వాస్తవమే.. నేను కేసీఆర్ కొడుకును కాబట్టే ఇక్కడ పొలిటీషియన్‌గా కూర్చున్న. అయితే నిలుదొక్కుకోవడం అంత ఈజీకాదు. ఒక్కసారే గెలిచి అనేకసార్లు ఓడిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ, కేసీఆర్ సొంతంగా ఎదిగివచ్చారు. మా పార్టీలో కూడా బాల్క సుమన్, గాదరి కిశోర్, రాకేశ్ లాంటి వారు స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు.
కేటీఆర్: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. పరిస్థితులు మారవచ్చు గాక.. వాటిని సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
కేటీఆర్: రాజకీయాల్లో భాగంగా ప్రతి రోజూ ఆయా వర్గాల ప్రజలను కలుస్తుంటాం. మన ప్రాధాన్యాలు గుర్తిస్తే అన్నిటినీ మేనేజ్ చేయొచ్చు. లైఫ్‌లో సక్సెస్ కావాలంటే టైమ్ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తప్పనిసరి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే లైఫ్‌లో సూపర్ సక్సెస్ కావొచ్చు.
కేటీఆర్: ఆలోచనల్లో స్పష్టత, దానిని వ్యక్తీకరించడంలో క్లారిటీ ఉండాలి. జీవితంలో గెలువాలంటే కూడా ఈ రెండూ తప్పనిసరి. కార్పొరేట్ వ్యవస్థ నుంచి నేను నేర్చుకుంది.. ఇదే!
కేటీఆర్: అవును.. మీ స్ట్రీట్కాజ్ ద్వారా ఎలాంటి సేవలందిస్తున్నారు?
శ్రావ్యారెడ్డి: చాలా చేస్తున్నాం సార్. మెడికల్ క్యాంపులు పెడుతున్నం. నిర్మాణాత్మకంగా ముందుకెళ్తున్నం. మాకు ఉన్న ఆర్థిక వెసులుబాటు మేరకు సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నం. భవిష్యత్‌లో మంచి సామాజిక సేవకులు(టీలీడర్లు)ను అందిస్తామనే నమ్మకంతో ముందుకుసాగుతున్నం.
కేటీఆర్: ఇందుకు తప్పకుండా నా సహకారం ఉంటది. ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ బాధ్యులు కలిసి ఈ ఏడు 200 మంది పేద పిల్లలకు ఫీజులు చెల్లించి చదివిస్తున్నమని చెప్పిన్రు. వచ్చే ఏడాది 500 మంది పిల్లల ఫీజులు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నా సహకారం కావాలని కోరారు. నేను కూడా సహకరిస్తానని హామీ ఇచ్చిన. మీకు సైతం అదే పద్ధతిలో నా సహకారం, ప్రోత్సాహం ఉంటది. కాంగ్రెస్ వాళ్లు రాసిచ్చిన బాండ్ పేపర్ లెక్క కాదు.. పక్కాగా చేస్త.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టింది. ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొడితే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తలేరని మా వాళ్లను అడిగాను. ‘ఎవరో ఒకరు నడపాలి కదా సార్! నడిపే వాళ్లు లేరు. ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే ముందుకు వస్తారు’ అన్నారు. సమస్య ఉధృతంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కొట్లాడుతాం. కానీ, పరిస్థితి తీవ్రతపై ఇది ముడిపడి ఉంటుంది. మిగతా సమయాల్లో డిజిటల్ యాక్టివిజం, మారుతున్న ట్రెండ్లు ప్రభావం చూపుతాయి.
కేటీఆర్: తప్పకుండా సహకరిస్తా. నాకు దేశంలో అనేక ప్రముఖ నగరాల్లో ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. వారందరిని మీ కంపెనీ అ భివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్త.