నాజూకైన శరీరాకృతి.. నల్లని కురులు కృతి సనన్ సొంతం. ఈ బాలీవుడ్ సుందరి సహజ సిద్ధమైన ఉత్పత్తులను వాడుతూ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నది. ఆ చిట్కాలు ఆమె మాటల్లోనే.. ‘నేను జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. రసాయన షాంపూల జోలికి వెళ్లను. ముఖ్యంగా సల్ఫేట్, పారాబెన్ జుట్టును పొడిగా, నిర్జీవంగా మార్చేయగలవు. మోరింగ ఆయిల్‌తో ఆ నష్టాన్ని నివారిస్తాను. ఈ తైలం జుట్టుకు తేమను ఇస్తుంది. అవకాడో, ఎర్ర ఉల్లిపాయ, గ్రీన్ టీ వంటివి నిత్యం ఉపయోగిస్తాను. ఇవి కేశాలకు పోషణను ఇస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి నా సొంతం. ప్రొటీన్ల కోసం ఆకుకూరలు ఎక్కువగా తింటాను. విటమిన్లు, మినరల్స్ మోతాదు మరీ పెరగకుండా డైట్ ఫాలో అవుతాను. అన్నట్టు, నా రోజువారీ ఆహారంలో అవకాడో తప్పనిసరి. ఇది జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. మీరు కూడా ఈ సూత్రాన్ని పాటించవచ్చు. ఖరీదైన బ్యూటీపార్లర్ల అవసరం లేకుండానే కేశాల అందాన్ని పెంచుకోవచ్చు’.