Fashion | అపరాజిత తూర్.. ఫ్యాషన్ ప్రపంచంలో తెలిసిన పేరు. చెప్పుల నుంచి ఆభరణాల వరకు తను డిజైన్ చేసే ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఇప్పుడు అపరాజిత ఓ సరికొత్త ట్రెండ్‌తో వచ్చారు. బర్మాలోని కాయన్ అనే తెగ మహిళల నుంచి స్ఫూర్తి పొంది.. వినూత్నమైన పాదరక్షలు రూపొందించారు. కాంస్యయుగం నాటికే కాయన్ తెగలో మాతృస్వామ్యం రాజ్యమేలేది.
ఆ మహిళల దర్పం, ఆత్మవిశ్వాసాలే స్ఫూర్తిగా The Kaya Gladiators పేరుతో ఈ పాదరక్షలు తయారుచేశారు. సౌకర్యంతో పాటు ఆకర్షణ ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. వలయాల రూపంలో వెండి బంగారు రంగులతో తయారుచేసిన ఈ శాండల్స్ తయారీలో చర్మాన్ని వాడకపోయినా… అంతే అనుభూతిని అందించేలా జాగ్రత్తపడ్డారు. పదివేల పైచిలుకు పలుకుతున్న ఈ చెప్పులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.