విడాకులు ఎక్కడిస్తారు?

నా పుట్టిల్లు, మెట్టిల్లు రెండూ హైదరాబాదే. పెండ్లయిన కొంతకాలానికే దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు మకాం మార్చాం. మేమిద్దరమూ దాంపత్యానికి చాలాకాలం నుంచీ దూరంగా ఉంటున్నాం. అతనో శాడిస్టు. నిత్యం దూషణలకు గురవుతూ మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. గత ఐదు నెలలుగా నా భర్త మరో నగరంలో ఉంటున్నాడు. నేనూ ఒంటరిగా జీవిస్తున్నా. విడాకులు తీసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. వాళ్ల ఒత్తిడి కారణంగానే చాలాకాలం నుంచీ భారతదేశానికి రావడానికి వెనుకాడుతున్నాను. కేప్‌టౌన్‌లో ఉంటూనే నేను విడాకులు పొందవచ్చా? విడాకులకు నా భర్త అంగీకరించకపోతే, వేరే దారులేమైనా ఉన్నాయా? దయచేసి నాకు మార్గం చూపండి.
ఓ ముస్లిం సోదరి
జ: మీ వివాహాన్ని భారతదేశం గుర్తించినట్లయితే మీ పెండ్లి, విడాకుల విషయంలో ఇక్కడి చట్టాలు వర్తిస్తాయి. మీరు నిరభ్యంతరంగా భారతదేశంలో విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే, కేసు ఫైల్ చేయడానికి ఇక్కడ ఒక అడ్వకేట్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, దక్షిణాఫ్రికాలోని స్థానిక చట్టాలనూ ఒకసారి లోతుగా పరిశీలించాలి. ఒకవేళ అక్కడి న్యాయస్థానాలు విదేశీ పెండ్లిళ్లకు విడాకులు ఇచ్చేందుకు అంగీకరిస్తే, మీరు అక్కడే తీసుకోవచ్చు. అంతేకాదు, మీ భర్త విడాకులకు అంగీకరించపోతే, కంటెస్టెడ్ డైవోర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ముస్లిం విడాకుల చట్టానికి, హిందూ విడాకుల చట్టానికి చాలా తేడాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడివల్ల భారతదేశానికి రాకుండా అక్కడి నుంచే విడాకులు తీసుకోవాలని అనుకుంటే, హైదరాబాద్‌లో ఒక లాయర్‌ను పెట్టుకోవాలి. వకాలత్‌నామా వంటి డాక్యుమెంట్లను మీ లాయర్‌కు కొరియర్ చేయాల్సి ఉంటుంది. అడ్వకేట్లు అడిగితే, వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా వర్చువల్ హియరింగ్స్‌కు కోర్టు మొగ్గుచూపుతుంది. మీకు కోర్టు నుంచి అనుమతి లభిస్తే కనుక, దక్షిణాఫ్రికా నుంచే విడాకుల కేసును నడిపించుకోవచ్చు. భయపడాల్సిన పన్లేదు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

