Healthy Baby | ఆరోగ్యకరమైన శిశువు ఎత్తు, బరువు ఎంత?

బిడ్డ జన్మించిన వెంటనే అందరి మనసుల్లోనూ మెదిలే ప్రశ్న .. శిశువు ఆరోగ్యంగా ఉందా? సాధారణంగా ఎత్తు-బరువు అనేవి బిడ్డ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.
బరువు:
గర్భం ప్రారంభమైన మొదటి రోజు నుంచి తొమ్మిది నెలల తరువాత జన్మించేవరకూ శిశువు దాదాపు అరవైకోట్ల రెట్లు పెరుగుతుంది. కానీ, జన్మించిన తరువాత నుంచి పెరుగుదల ఆగిపోయే వరకు 20 రెట్లు మాత్రమే పెరుగుతారు. పుట్టినప్పుడు అమ్మాయి 3.2 కేజీలు, అబ్బాయి 3.3 కేజీలు ఉండాలని ఐసీఎంఆర్ నిర్దేశిస్తున్నది. ప్రసవం తరువాత మొదటి 4-5 రోజులు దాదాపు 5-8% బరువును కోల్పోతారు. పదోరోజు నాటికి కోల్పోయిన బరువును సమకూర్చుకొంటారు. బిడ్డ కోరినప్పుడల్లా తల్లి పాలు తాగిస్తే శిశువు బరువు తగ్గడం అరుదు. జన్మించిన వెంటనే, ఇరవై నాలుగు గంటల తర్వాత, వారం రోజులకు, తిరిగి రెండు వారాలకు బిడ్డ బరువు చూడాలి. ఆ తరువాత మొదటి ఆరు నెలలూ ప్రతి పదిహేను రోజులకొకసారి, ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ప్రతి నెలా బరువు రికార్డు చేయాలి. దీనివల్ల శిశువు పెరుగుదల సరిగ్గా ఉందో లేదో గమనించవచ్చు. అవసరమైన జాగ్రత్తలూ తీసుకోవచ్చు. శిశువులు మొదటి నాలుగు నెలలు వారానికి 200-300 గ్రాములు పెరుగుతారు. తక్కువలో తక్కువ 125 గ్రాములైనా పెరగాలి. నాలుగు నెలల తర్వాత, నెలకు కనీసం 400 గ్రాములు పెరగాలి. ఆరోగ్యంగా ఉన్న శిశువు బరువు 5 నెలలకు రెట్టింపు అవుతుంది. సంవత్సరానికి మూడు రెట్లు అవుతుంది. పిల్లల్లో పెరుగుదల మొదటి సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత తిరిగి యుక్త వయసులో కనిపిస్తుంది. బరువు తక్కువ పిల్లలు మొదటి కొద్ది నెలలు వేగంగా బరువు పెరుగుతారు. ఎక్కువ బరువుతో పుట్టినవాళ్లు నెమ్మదిగా పెరుగుతారు.
ఎత్తు:
పిల్లలు తమంతట తాము నిలుచునే వయసుకు వచ్చే వరకు (రెండు సంవత్సరాలు) పడుకోబెట్టి చూసే దాన్ని ‘పొడవు’ అంటారు. నిలుచున్నప్పుడు చూసేదాన్ని ‘ఎత్తు’ అంటారు. పడుకోబెట్టి పొడవు చూసే పరికరం పేరు ‘ఇన్ఫాంటో మీటర్’. ఆరోగ్యంగా జన్మించిన శిశువు దాదాపు 50 సెం.మీ. ఉంటుంది. మూడు నెలలకు 60 సెం. మీటర్లు, 9 నెలలకు 70 సెం. మీటర్లు, సంవత్సరానికి 75 సెం. మీటర్లు ఉంటుంది. ఆ తరువాత 10-12 సంవత్సరాల వరకూ ప్రతీ సంవత్సరం దాదాపు 5 సెంటీమీటర్లు పెరుగుతారు. పిల్లల పొడవు తల్లిదండ్రుల ఎత్తు, వంశపారంపర్యత, తీసుకునే ఆహారం.. తదితర విషయాలపై ఆధారపడి ఉంటుంది.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- healthy baby
- height
- weight
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

