బ్యాగ్ బరువు కాకుండా..!
జూన్ రాగానే పిల్లల వీపుపై పుస్తకాల బరువు పెరిగిపోతుంది. దీనివల్ల వాళ్లకు వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ఈ సమస్య రాకుండా అమ్మలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!
జూన్ రాగానే పిల్లల వీపుపై పుస్తకాల బరువు పెరిగిపోతుంది. దీనివల్ల వాళ్లకు వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లలకు ఈ సమస్య రాకుండా అమ్మలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి!
- పిల్లల బరువులో స్కూల్ బ్యాగ్ బరువు 10% కంటే ఎక్కువ ఉండకూడదు.
- ఎప్పుడూ రెండు భుజాలపైనే బ్యాగ్‌ను ధరించేలా పిల్లలకు అలవాటు చేయాలి. బ్యాగ్‌ను వన్‌సైడ్ వేసుకోనివ్వకూడదు. ఒకే భుజంపై మోయడం వల్ల మెడ, భుజాల నొప్పులు వస్తాయి.
- బ్యాగ్ నడుము కంటే కిందికి వేలాడకుండా పట్టీల పొడవును సరిచేయాలి. వెన్నుకు దగ్గరగా ఉండేలా ధరించడం మంచిది. రెండు భుజాలకూ స్ట్రాప్స్ సమానంగా ఉండేలా అడ్జస్ట్ చేయాలి.
- అనవసరమైన డైరీలు, అవసరం లేని టెక్ట్స్ బుక్స్ ఇంట్లోనే పెట్టేలా.. రోజూ టైమ్ టేబుల్ ప్రకారం బ్యాగ్ సర్దడం పిల్లలకు అలవాటు చేయాలి.
- బరువైన పుస్తకాలను బ్యాగ్‌లోని వెన్నుకు ఆనుకునే భాగంలో అమర్చితే బరువు సమానంగా పంపిణీ అవుతుంది. దీంతో వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది.
- బ్యాగ్ బరువు ఎక్కువగా ఉంటే ట్రాలీ తరహావాటిని ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలకు ఇవి భుజాలు, నడుముపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

