క్యాప్సుల్స్‌లో ఫిల్టర్ కాఫీ

‘కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు’ అని కాఫీ దండకమే రాసేశారో కవి. ఇంట్లో ఉంటే.. కావాల్సినప్పుడు కాఫీ అందుతుంది కానీ, ప్రయాణాల్లో అన్ని వేళలా దొరక్కపోవచ్చు. అందులోనూ ఫిల్టర్ కాఫీ గగనమే. సమయానికి ‘చుక్క’ పడక రసాభాస చేసేస్తుంటారు కొందరు. ఇలాంటి వారి కోసమే ఫిల్టర్ కాఫీ పిల్స్‌ను తయారు చేశారు ఎర్నాకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు. ఇంటర్ చదువుతున్న ఈ విద్యార్థినులు టై గ్లోబల్ సంస్థ నిర్వహించిన బిజినెస్ కాన్సెప్ట్ పోటీలో చిక్కటి కాఫీ లాంటి ఐడియాతో పాల్గొన్నారు. ఫిల్టర్ కాఫీని క్యాప్సుల్స్ రూపంలో సృష్టించి విజేతలుగా నిలిచారు. టై గ్లోబల్ నుంచి ‘పాపులర్ చాయిస్’ అవార్డునూ గెలుచుకున్నారు.. సౌందర్య లక్ష్మి, ఎలిషా అనోరి, డింపుల్, శివనందన. దేశదేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో ఈ నలుగురు అమ్మాయిల కాన్సెప్ట్ అందరి మన్ననలూ అందుకుంది. ఎర్నాకులం బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న నలుగురూ కళాశాలలోనే ప్రయోగాలు చేసి ఫిల్టర్ కాఫీని క్యాప్సుల్స్‌గా మలిచారు. వీటిని వేడినీళ్లలో వేసి అరనిమిషం ఉంచితే చాలు, రుచికరమైన కాఫీ సిద్ధమవుతుంది. ప్రయాణాలప్పుడు పది క్యాప్సుల్స్ బ్యాగులో వేసుకుంటే సరి. ఎక్కడైనా కాఫీ తాగేయొచ్చు. తమ ఐడియాకు అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు నలుగురూ. కాఫీ క్యాప్సుల్స్ తయారీకి లైసెన్స్ కోసం దరఖాస్తు చేశామన్నారు. ఇంటర్ పూర్తయ్యాక బిజినెస్ వెంచర్ ప్రారంభిస్తామని చెబుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- capsule
- Coffee
- filter coffee
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

