కాటన్ దొరసానులు!
ఎండకాలం వచ్చిందంటే చాలు మగువల మనసు చేనేత చీరలపై మళ్లుతుంది. మెత్తగా, చల్లగా మేనికి సౌకర్యంగా ఉండే కాటన్ చీరలంటే మక్కువ చూపిస్తారు. చేనేత చీరలకూ కాస్త డిజైనర్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ని చూస్తే తెలుస్తుంది. నేటి మహిళల మనసు దోచేస్తున్న ఆ డిజైన్లేంటో చూద్దాం..

ఎవర్ ‘గ్రీన్’
కొన్ని రంగుల కాంబినేషన్లు ఎప్పుడూ అలరిస్తాయి. ముదురు ఆకుపచ్చ చీరకు మెరూన్ బార్డర్ అదిరిపోయే కాంబినేషన్. లైట్ గోల్డ్ కలర్లో మెరూన్ బార్డర్ని హైలైట్ చేశారు. మామూలుగా కుచ్చిళ్లు పోయకుండా దోతీ స్టయిల్లో పిన్ చేశారు. చీర బార్డర్‌కి సరిపోయేలా మెరూన్ కలర్ బెనారస్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ డిజైన్ చేశారు. ట్రెండీగా కనబడేందుకు స్లీవ్‌లెస్ హ్యాండ్స్ ఇచ్చారు. సంప్రదాయంతోపాటు ఫ్యాషన్ ఉట్టిపడే డిజైన్ ఇది.
చుక్కల్లో చందమామలా..
హాఫ్ వైట్ ఖాదీ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన డిజైనర్ చీర ఇది. హాఫ్ వైట్ ప్లేన్ ఫ్యాబ్రిక్‌కి నప్పేలా బ్లాక్ సీక్వెన్స్‌తో బార్డర్ ఇచ్చారు. చీరకు నప్పేలా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న చెక్స్ డిజైనర్ బ్లౌజ్‌ని రూపొందించారు. ఆధునిక ఫ్యాషన్‌కి సరిపోయేలా స్లీవ్‌లెస్ హ్యాండ్స్తోపాటు ఫుల్నెక్ ఇచ్చారు. బార్డర్ కాంబినేషన్లో ఇచ్చిన హ్యాండ్‌మేడ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ బెల్ట్ ట్రెండీ లుక్ ఇస్తున్నది. స్టోన్ బటన్స్, కర్దనాతో ఇచ్చిన టస్సెల్స్ అదనపు ఆకర్షణ.
మోడల్: అశికా శెట్టి
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్, follow us on: instagram.com/riteshareddy, 7013639335
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

