ఆశ్లేషకు అభిమానుల వెల్లువ

‘ద ఫ్యామిలీమ్యాన్-2’ వెబ్‌సిరీస్‌తో సమంత తర్వాత అంతటి క్రేజ్ సంపాదించింది ఆశ్లేష ఠాకూర్. అందులో మనోజ్ బాజ్‌పేయ్ కూతురు ధృతిగా ఆమె చూపిన అభినయం ఓటీటీ ప్రియులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు పెండ్లి సంబంధాలు విచ్చలవిడిగా వచ్చేస్తున్నాయి. వెబ్‌సిరీస్‌లో కల్యాణ్ అనే మాయగాడి ప్రేమలోపడి ఇక్కట్ల పాలవుతుంది ధృతి. తండ్రి సాయంతో ఆ చెర నుంచి బయటపడుతుంది. ఆ పాత్రకు సరైన న్యాయం చేసిన ఆశ్లేషపై మనసు పారేసుకుంటున్నారు కుర్రకారు. ‘తాము కల్యాణ్‌లాంటి వాళ్లం కాదనీ, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామ’ంటూ సందేశాలు పంపుతున్నారు. తనను పెండ్లి చేసుకోవాలంటూ ట్విట్టర్, ఇన్‌స్టా వేదికగా రాయబారాలు చేస్తున్నారు. వీటిని స్పోర్టివ్‌గా తీసుకున్న ఆశ్లేష ‘నన్ను అభిమానిస్తున్న వారందరికీ థ్యాంక్స్! మీరు పంపుతున్న సందేశాలు చాలా అందంగా ఉన్నాయి. ఆనందాన్నీ కలిగిస్తున్నాయి. కానీ, ఎవరు ఎలాంటి వారో తను తెలుసుకోలేకపోతున్నాన’ంటూ స్పందించింది. వీరిలో సరైన వరుడ్ని ఎంపిక చేసుకోవడానికి మనోజ్ బాజ్‌పేయ్ ‘చెల్లం సార్’ సలహా తీసుకోవాలంటూ కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వెబ్‌సిరీస్‌లో ధృతి లవర్‌బాయ్‌గా నటించిన అభయ్వర్మకు కూడా యువతుల నుంచి అదేస్థాయిలో ప్రపోజల్స్ వస్తున్నాయట.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- ashlesha
- Family Man 2
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

