గుడ్డును మించిన పోషకాల గని మరొకటి లేదు. మండే టు సండే రోజూ అండే కావాలనుకునేవాళ్లూ ఉంటారు. ఎంత తినాలని ఉన్నా.. రోజూ ఉడకబెట్టిన గుడ్డు లాగించడం కష్టంతో కూడుకున్న పని. అలాగని పగులగొట్టుకు ఆమ్లెట్ వేసుకుందామన్నా, లోపలి సొనతో పొట్టపోసుకుందామన్నా.. పచ్చసొన పనికిరాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
కానీ, ఎగ్గును దిగ్గున పగులగొడితే తెల్లసొన, పచ్చసొన టక్కున కలిసిపోతాయి. వాటిని సపరేట్ చేయడం గుడ్డు పగులగొట్టినంత ఈజీ కాదు. ఈ కష్టానికి చెక్ పెట్టడానికి వచ్చిందే ఈ ఎగ్ యోక్ సపరేటర్ గ్యాడ్జెట్. దీనిని తీసుకొని గుడ్డును రెండు తగిలిస్తే… పచ్చసొన పైనే తేలిపోయి, తెల్లసొన చక్కగా పాత్రలోకి జారుకుంటుంది. ఒటోటో డిజైన్స్ డిజైన్ చేసిన ఎగ్ సపరేటర్ బాస్కెట్ బాల్ నెట్‌ను పోలి ఉంటుంది. ఈ కిచెన్ గ్యాడ్జెట్ తోడుంటే రోజుకు డజన్ గుడ్లు టపీ టపీమని తెగ్గొడుతూ కావాల్సినన్ని ఆమ్లెట్లు వేసుకోవచ్చు.