గాజు స్ట్రా.. తేనె పూసిన కత్తి
ఆరోగ్యంపట్ల అవగాహన పెరగడంతో దుస్తులు, మేకప్, ఇంటీరియర్, కుక్వేర్ అన్నీ మారిపోతున్నాయి. ఇదంతా మంచికే. కానీ, ఈ ట్రెండ్ కూడా ప్రమాదకరమైన దారిలోకి పోతోందిప్పుడు. ప్లాస్టిక్‌తో వచ్చే అనారోగ్య సమస్యలే కాదు పర్యావరణానికి అది ఎంత ప్రమాదమో కూడా తెలుసుకున్నాం. కొంత జాగ్రత్త పడుతున్నాం.
ఆరోగ్యంపట్ల అవగాహన పెరగడంతో దుస్తులు, మేకప్, ఇంటీరియర్, కుక్వేర్ అన్నీ మారిపోతున్నాయి. ఇదంతా మంచికే. కానీ, ఈ ట్రెండ్ కూడా ప్రమాదకరమైన దారిలోకి పోతోందిప్పుడు. ప్లాస్టిక్‌తో వచ్చే అనారోగ్య సమస్యలే కాదు పర్యావరణానికి అది ఎంత ప్రమాదమో కూడా తెలుసుకున్నాం. కొంత జాగ్రత్త పడుతున్నాం. ప్లాస్టిక్‌ని పర్యావరణంలోకి రాకుండా చేయాలంటే ముందు కిచెన్‌లోకి రాకుండా చూసుకోవాలని చాలామంది గాజు కంటెయినర్లు, పింగాణీ పాత్రలు కొంటున్నారు. ప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా పేపర్ స్ట్రాలు వచ్చాయి. ఇవి నీటిలో నానితే కాసేపటికే మెత్తబడిపోవడమే కాదు పానియాలను కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి పేపర్ స్ట్రాలకు ప్రత్యామ్నాయంగా గాజు స్ట్రాలను కొంటున్నారు. ఈ కామర్స్ యాప్‌లలో కనిపించే కొత్త వస్తువులను కొనాలనే కుతూహలంతో వాటితో వచ్చే సమస్యల గురించి తెలుసుకోకుండానే ఆర్డర్ చేస్తున్నారు.
ఇటీవల ఆన్లైన్ మార్కెట్లో గాజు స్ట్రాలు అతి తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వాటిని వాడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. గాజు స్ట్రాలను వాడిన ప్రతిసారీ శుభ్రం చేసే సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు పగుళ్లు రావొచ్చు. అంచులు చిట్లి పోవచ్చు. వీటిని భద్రపరిచినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా తాకినా చిట్లుతాయి. గాజు స్ట్రా పగుళ్ల వల్ల పెదవులు, నాలుకకు కనిపించని గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. స్ట్రా అంచుల్లో ఉండే చిన్న చిన్న పగుళ్ల నుంచి సూక్ష్మంగా ఉండే గాజు పలుకులు పానియాలను పీల్చేటప్పుడు నోట్లోకి వచ్చేస్తాయి. అక్కడి నుంచి జీర్ణవ్యవస్థలోకి జారుకుంటాయట. అవి జీర్ణ వ్యవస్థలోని మూలల్లో కొంతకాలం ఉండిపోయి గాయాలు చేసే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ‘ఏ రాయి అయితేనేం’ అనే సామెతలో చెప్పినట్టు గాజు, ప్లాస్టిక్ స్ట్రాలు రెండూ ప్రమాదమే. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు కాకూడదు. కాబట్టి వీలున్నంత వరకు నోటితో పానియాలు తాగడమే ఉత్తమం. కుదరకపోతే పేపర్ స్ట్రా ఉపయోగించడం కొంత మెరుగు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

