నెలల శిశువుకు కడుపునొప్పి వస్తుందా?
మా పాపకు రెండున్నర నెలలు. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఐదున్నర కిలోల బరువు ఉంది. తల్లి పాలే పడుతున్నాం. పాప మల విసర్జన సరిగా లేదు. పోయిన వారంలో నాలుగు రోజుల తర్వాత విరేచనం అయింది. అయిదు రోజులు గడిచినా ఈ వారంలో ఇంకా విరేచనం కాలేదు. పిల్లల డాక్టర్కి చూపిస్తే.. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
- పిల్లల పెంపకం
మా పాపకు రెండున్నర నెలలు. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఐదున్నర కిలోల బరువు ఉంది. తల్లి పాలే పడుతున్నాం. పాప మల విసర్జన సరిగా లేదు. పోయిన వారంలో నాలుగు రోజుల తర్వాత విరేచనం అయింది. అయిదు రోజులు గడిచినా ఈ వారంలో ఇంకా విరేచనం కాలేదు. పిల్లల డాక్టర్కి చూపిస్తే.. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. రెండు రకాల ఓరల్ డ్రాప్స్ (చుక్కల మందు) ఇచ్చారు. పాలు ఎక్కువగా తాగకుండా చూసుకోమని సలహా ఇచ్చారు. ఆ మందులు వాడిన మరుసటి రోజు కూడా మోషన్ కాలేదు. అప్పుడప్పుడూ ఏడుస్తున్నది. కడుపు నొప్పితో ఏడుస్తుందేమోనని అనుకుంటున్నాం. అడపాదడపా పాలు తాగిన తర్వాత వాంతి చేసుకుంటున్నది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
బరువు చక్కగానే ఉంది. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు రోజూ మోషన్కి పోకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పిల్లలకు రోజుకు అయిదుసార్లు విరేచనాలు కావొచ్చు. అయిదు రోజులకు ఒకసారి విరేచనం కావొచ్చు. రెండూ సాధారణమే. కాకపోతే బిడ్డ కొద్దిగా అసౌకర్యంగా ఉన్నట్టు, ఇబ్బందిపడుతున్నట్టు చెప్పారు. అది బహుశా కడుపులో గ్యాస్ ఏర్పడడం వల్ల కలిగి ఉండొచ్చు. ఆరు నెలలలోపు శిశువులకు ఈ సమస్య కూడా సాధారణమైనదే. మీకు డాక్టర్లు ఓరల్ డ్రాప్స్ ఇచ్చారని చెప్పారు. అవి గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అడపాదడపా వాడొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం.. తల్లిపాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకుని ఓ పదిహేను, ఇరవై నిమిషాలు నిటారుగా ఉంచుకుంటే.. తేన్పులు వచ్చి రిలీఫ్గా ఉంటుంది.
కాకపోతే తల్లి భోజనంలో మసాలాలు, కారాలు తగ్గించుకోవాలి. అలాగని పథ్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఆరు నెలల్లోపు పిల్లలు పాలు తాగిన తర్వాత వాంతులు చేసుకుంటే పెరుగులా రావడం సహజం. సాధారణంగా వాంతి అయినప్పుడు అన్నవాహిక నుంచి ఆహారం బయటపడుతుంది. కానీ ఆరు నెలల్లోపు పిల్లలకు వాంతి అయితే జీర్ణాశయానికి చేరిన పాలు తిరిగి బయటికి వస్తాయి. చిన్న వయసు శిశువుల్లో అన్న వాహికకు, జీర్ణాశయానికి మధ్యన ఉండే కండరాలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి జీర్ణాశయం చేరిన పాలు తిరిగి అన్నవాహికలోకి వస్తాయి. అందుకే వాంతి అయినప్పుడు బయటపడిన పాలు పెరుగులా ఉంటాయి. ఆ వాంతులకు కంగారుపడకండి. బిడ్డ బరువు సరిగా ఉండి, హుషారుగా ఉంటే దీనికి ప్రత్యేకమైన చికిత్స అవసరమే లేదు. ఒకవేళ బిడ్డకు వాంతులు ఆకుపచ్చ రంగులో అయితే, పొట్ట అకస్మాత్తుగా ఉబ్బితే వెంటనే డాక్టర్కి చూపించాలి. సాధారణంగా వచ్చే పాలలాంటి, పెరుగులాంటి వాంతులకు కంగారుపడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డకు గ్యాస్ వల్ల పేగుల్లో నొప్పి కలిగి ఉండి ఉంటుంది. ఇప్పటికే పిల్లల వైద్యులు చూశారు. కాబట్టి కంగారు పడకండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

