ఇది పంబ లకిడి జంబ
దండెం మీద ఆరేసిన ఆడవాళ్ల దుస్తుల్ని తీసేప్పుడు ఎవరైనా చూస్తారేమోనని సిగ్గుపడే మగవాళ్లు చూసి నేర్చుకోవాల్సిన వీడియో ఇది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ వినయ్ రాజ్‌పుత్ ‘వేసవిలో అత్యంత సౌకర్యవంతమైన దుస్తులు ఇవే’నంటూ రాసిన వీడియోలో తన స్నేహితుడితోపాటు తనూ నైటీ ధరించాడు.
దండెం మీద ఆరేసిన ఆడవాళ్ల దుస్తుల్ని తీసేప్పుడు ఎవరైనా చూస్తారేమోనని సిగ్గుపడే మగవాళ్లు చూసి నేర్చుకోవాల్సిన వీడియో ఇది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్ వినయ్ రాజ్‌పుత్ ‘వేసవిలో అత్యంత సౌకర్యవంతమైన దుస్తులు ఇవే’నంటూ రాసిన వీడియోలో తన స్నేహితుడితోపాటు తనూ నైటీ ధరించాడు. బైక్ మీద రయ్ మంటూ రాత్రివేళ దూసుకుపోతున్న వీడియోని vinayrajput.07 హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోకి అన్ని రకాల కామెంట్లూ వచ్చాయి. కామెంట్లదేముంది? రకరకాల వాళ్లుండే సోషల్ మీడియాలో కామెంట్స్‌కి విలువ లేదు. కానీ, ఆ పోస్ట్‌కి ఉన్న ఆదరణ గమనించదగ్గదే. మగవాళ్ల మధ్య జరిగే గొడవలో ఒకరినొకరు అవమానించుకోవడానికి కూడా ఆడవాళ్ల పేర్లే బయటికి తీస్తారు. మగవాళ్ల దుస్తులే పౌరుషానికి ప్రతీకలైనట్టు! ఆడవాళ్ల దుస్తుల్ని హేళన చేస్తారు. చీరలు, రవికలను పిరికితనానికి, అసమర్థతకు ప్రతీకలుగా చేసి తిట్టుకుంటారు.
తరాలతోపాటు ఆలోచనలూ మారుతున్నాయి. ఆడవాళ్ల దుస్తులు ధరించడానికి సిగ్గుపడే అబ్బాయిలు ‘ఉక్కపోతలో శరీర సౌఖ్యానికి నైటీలే బెస్ట్’ అని ప్రశంసించడమే కాదు ప్రచారం కల్పించడం అద్భుతమే కదా! ఇన్‌స్టాలో mastikhorayushhh హ్యాండిల్ నడిపే ఆయుష్మాన్ వాళ్ల అమ్మ నైటీ వేసుకుని ఇంట్లో రకరకాల పనులు చేస్తూ రీల్‌ని రిలీజ్ చేశాడు.
మరొక ఇన్ఫ్లూయెన్సర్ రాజ్ నైటీతో ఏకంగా సూపర్ మార్కెట్లో షాపింగ్‌కే వెళ్లాడు. తన రీల్ పోస్ట్‌పై నేటికాలంలో ‘భారతీయ పురుషుల దుస్తులు ఇవే’ అనే కోట్తో రాశాడు. ఈ సోషల్ మీడియా ట్రెండ్ నైటీలకు ఆదరణ పెంచకపోయినా ఆడవాళ్ల దుస్తుల పట్ల గౌరవాన్ని పెంచుతున్నది. ‘కనరా.. వినరా.. జంబలకిడి పంబా అనరా’ పాటనే కాదు ఆ సినిమానూ గుర్తుతెచ్చే ఈ సరదా వీడియోలకు నవ్వుకున్నా సరే నెటిజన్లు జై కొడుతున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

