బాదం పప్పు: అర కప్పు,
పిస్తా పప్పు: పావు కప్పు,
చక్కెర: అర కప్పు,
పాలపొడి: పావు కప్పు,
యాలకుల పొడి: అర టీస్పూన్,
నెయ్యి: ఒక టేబుల్ స్పూన్,
ఫుడ్ కలర్ (గ్రీన్): రెండు చుక్కలు.
బాదం పప్పును గంటపాటు వేడినీళ్లలో నానబెట్టి పొట్టుతీసి ఆరబెట్టాలి. మిక్సీ జార్లో బాదం పప్పు, పిస్తా మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి చక్కెర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుతూ తీగపాకం వచ్చాక బాదం మిశ్రమం జోడించి కలపాలి.
మిశ్రమం దగ్గర పడుతుండగా పాలపొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి.. దగ్గర పడ్డాక దించేయాలి. ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి మిశ్రమాన్ని సమంగా పరిచి పైనుంచి బాదం, పిస్తా ముక్కల్ని చల్లాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే నోరూరించే పిస్తా బాదం బర్ఫీ సిద్ధం.