Dasara Special : నేడే చూడండి దసరా సరదాలు

మళ్లీ.. ఈలలు వినిపిస్తాయి. గోలలు కనిపిస్తాయి. కాగితాలు గాల్లోకి ఎగురుతాయి.టికెట్లు తెగ తెగుతాయి. దసరా వచ్చేస్తున్నది.. సరదా సినిమాలూ తెచ్చేస్తున్నది.. బరిలో భారీ సినిమాలు లేకున్నా.. ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు ఆశల పల్లకిలో వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘సీటీమార్’, ‘లవ్‌స్టోరీ’, ‘కొండపొలం’ ఓపెనింగ్స్ ఇచ్చిన కిక్‌తో మొండిగా వెండితెరపైనే అదృష్టాన్నిపరీక్షించుకోవాలని ఫిక్సయ్యారు సినీజనాలు. దసరా వేడుకలకు కుదిరితే ఒక సినిమా.. వీలైతే మరో రెండు సినిమాలు జోడించి చూడండి. అప్పుడే, థియేటర్లలో సినీసందడి దసరా దాటుకొని.. దీపావళి చూసుకొని.. సంక్రాంతి దాకా చేరుకుంటుంది. ఈ దసరాకు విడుదలవుతున్న సినిమాలపై ఓ లుక్కేయండి.
ఓటీటీలోనూ సందడి
కరోనా కాలంలో ఓటీటీకి అలవాటుపడిన ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలు ఆ ప్లాట్‌ఫామ్‌లోనూ విడుదల అవుతున్నాయి. కంగనా రనౌత్ నటించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెలుగు వెర్షన్ నేడు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్నది. తాప్సీ కథానాయికగా నటించిన ‘రష్మీ రాకెట్’ 15న జీ5లో విడుదల కానుంది. 16న అమెజాన్‌లో రిలీజవుతున్న ‘సర్దార్ ఉధమ్ సింగ్’ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. దసరా సెలవుల్లో ఇంటిల్లిపాదీ సరదాగా గడిపేందుకు ఇటీవల థియేటర్లలో విడుదలైన పలు చిత్రాలు సైతం ఓటీటీలో కనువిందు చేస్తున్నాయి. ‘ఒరేయ్ బామ్మర్ది’, ‘రాజ రాజ చోర’, ‘అందగాడు’, ‘ఎస్ఆర్ కళ్యాణ మంటపం’ తదితర సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి.
దసరాకు ముందస్తు కళ తీసుకొచ్చిన సినిమా ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు మంచి ఓపెనింగ్స్ సాధించి, పండుగకు విడుదలవుతున్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.
అరుదైన జోడి కుదిరేనా?: మహా సముద్రం
లవ్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ అరుదైన కలయిక ఈ చిత్రానికి ప్లస్ పాయింట్‌గా నిలుస్తున్నది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో వినూత్న దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి నిర్దేశకత్వంలో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభించింది. కథానాయికలు అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ అందచందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నాయి సినీవర్గాలు. మహర్నవమి నాడు రిలీజవుతున్న ‘మహా సముద్రం’ దసరా సరదాలకు ఒక రోజు ముందే తెరలేపుతుంది.
మోస్ట్ వాంటెడ్ హిట్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
అందంగా ఉంటాడు. చక్కగా డ్యాన్సులు చేస్తాడు. ఫైట్లు అదరగొడతాడు. అయినా, అక్కినేని అఖిల్‌కు బ్రేక్ రాలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు అఖిల్. పూజా హెగ్డేతో జట్టుకట్టి దసరాకు ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొన్నేండ్లుగా విజయం కోసం పరితపిస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దసరానాడు థియేటర్లలో విడుదల కానుందీ బొమ్మ.
వినోదాల విందు: వరుడు కావలెను
కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్‌ను సృష్టించుకోగలిగాడు నాగశౌర్య. ఆయన నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’ దసరా రోజు విడుదల కానుంది. ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రితూవర్మ కథానాయిక. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, దసరా రేస్ నుంచి ఈ చిత్రం తప్పుకొంటున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటి వరకైతే అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
పాతికేండ్ల తర్వాత: పెళ్లి సందD
శ్రీకాంత్ కథానాయకుడుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ‘పెళ్లి సందడి’. సరిగ్గా పాతికేండ్లకు మరో ‘పెళ్లి సందD’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండటం విశేషం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ దసరా రోజు విడుదల అవుతున్నది. శ్రీలీల కథానాయిక. గౌరీ రోణంకి దర్శకురాలు. సినిమాలో దర్శకేంద్రుడు అతిథి పాత్రలో కనిపించనున్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

