మైక్రో జోనింగ్.. ఇది కట్టని గోడ!
ఇంట్లో హాలు పెద్దగానే ఉన్నా చదువుకోవడానికి, పని చేసుకోవడానికి ప్రత్యేకమైన చోటు ఉండాలని అనిపిస్తుందా? అందుకోసం కొత్త గదిని నిర్మించాల్సిన అవసరం లేదు.
ఇంట్లో హాలు పెద్దగానే ఉన్నా చదువుకోవడానికి, పని చేసుకోవడానికి ప్రత్యేకమైన చోటు ఉండాలని అనిపిస్తుందా? అందుకోసం కొత్త గదిని నిర్మించాల్సిన అవసరం లేదు. మైక్రోజోనింగ్ అనే ఇంటీరియర్ ఆలోచనతో ఒకే గదిలో వేర్వేరు పనులకు ప్రత్యేకమైన ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు హాల్లో ఒక మూలన చిన్న బల్ల, కుర్చీ పెడితే అది పని చేసుకునే చోటవుతుంది.
సోఫా, కుర్చీలను ప్రత్యేకంగా అమర్చడం ద్వారా బంధువులు, స్నేహితులతో కూర్చునేందుకు ప్రత్యేక స్థలంలా మార్చుకోవచ్చు. తెరలను, పొడవాటి డిజైనర్ బల్లలను, మొక్కలను కూడా ఇలా ఇంట్లో ఒక భాగాన్ని విడిగా చేసేందుకు వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో గోడలు నిర్మించకుండానే ప్రతి ప్రాంతానికీ ఒక ప్రత్యేక ప్రయోజనం కల్పించవచ్చు. ముఖ్యంగా చిన్న అపార్టుమెంట్లలో ఇది ఉపయోగకరం. అయితే నడిచేందుకు తగినంత ఖాళీ ఉండేలా ఫర్నిచర్ అమర్చుకోవాలి. ఈ మైక్రోజోనింగ్ పద్ధతి ద్వారా ఇంట్లో గదుల సంఖ్య పెంచలేకపోయినా… ఉన్న గదికి కొత్త ఉపయోగాలు కల్పించవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

