ఘుమఘుమల గాలి వంట!
వంటగ్యాస్ కొండెక్కి కూర్చుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వంట సామగ్రే మనల్ని ఆదుకుంటుంది. అన్నం కోసం ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండనే ఉంది. ఇక ఎయిర్ ఫ్రైయర్లో కూరల్ని వండుకోవడం.. చాలా రోజుల్నుంచే అలవాటైంది.
వంటగ్యాస్ కొండెక్కి కూర్చుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వంట సామగ్రే మనల్ని ఆదుకుంటుంది. అన్నం కోసం ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండనే ఉంది. ఇక ఎయిర్ ఫ్రైయర్లో కూరల్ని వండుకోవడం.. చాలా రోజుల్నుంచే అలవాటైంది. అయితే, ఎయిర్ ఫ్రైయర్‌ను వాడేటప్పుడు కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి. లేకుంటే, ఆహారం రుచి తగ్గుతుంది. మిషిన్ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
ఎయిర్ ఫ్రైయర్లో వంట కోసం నూనె అక్కర్లేదని అనుకుంటారు. కానీ, నూనె లేకుంటే ఆహారం పొడిపొడిగా మారిపోతుంది. ఇక నూనెను నేరుగా బాస్కెట్లోనే పోయడం కూడా కరెక్ట్ కాదు. ఆహార పదార్థాలకు నూనెను బ్రష్‌తో రాయడం, స్ప్రే చేయడం మంచిది. దీనివల్ల వండిన పదార్థాలు బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా తయారవుతాయి.
ఓవెన్ మాదిరిగానే ఎయిర్ ఫ్రైయర్‌ను కూడా.. వాడటానికి ముందు కనీసం 3 నుంచి 5 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. లేకుంటే, ఆహారం బాగా వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. బాస్కెట్‌ను పూర్తిగా నింపేయడం. ఎయిర్ ఫ్రైయర్ అంటేనే.. వేడి గాలి ద్వారా పని చేస్తుంది. బాస్కెట్లో పదార్థాలను నింపేయడం, ఒకదానిపై ఒకటి వేయడం చేస్తే.. గాలి సరిగ్గా ప్రసరించదు. దాంతో, పదార్థాలు సరిగ్గా ఉడకవు. కొన్నిచోట్ల మెత్తగా, మరికొన్ని చోట్ల పచ్చిగా ఉంటుంది. దీనికి పరిష్కారం..
బాస్కెట్లో తక్కువ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఒకే పొరలా పరుచుకోవాలి.
పదార్థాలను ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి.. పూర్తయ్యేదాకా అటువైపు చూడరు. కానీ, ఆహారాన్ని మధ్యలో కలిపితేనే.. అన్నివైపులా ఉడుకుతుంది. కాబట్టి, వంట సమయం సగం పూర్తయ్యాక.. ఒకసారి బాస్కెట్ తీసి ఆహారాన్ని కలపాలి.
పకోడీలు, బజ్జీలు లాంటివి చేయడానికి పల్చని పిండి మిశ్రమాలను ఎయిర్ ఫ్రైయర్లో నేరుగా వేయకూడదు. దీనివల్ల పిండి కిందికి కారిపోతుంది. గాలి ప్రసరణకు అడ్డుపడుతుంది. కాబట్టి, పకోడీలు, బజ్జీలు వేసుకోవడానికి పిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్‌ను వాడిన ప్రతిసారి దాన్ని శుభ్రం చేయాలి. బాస్కెట్ కింద పేరుకుపోయే నూనెలు, పదార్థాల అవశేషాలను తొలగించాలి. లేకుంటే, తర్వాతి వంట చేసేటప్పుడు.. అవి కాలిపోయి పొగ వస్తుంది. ఇక ఎయిర్ ఫ్రైయర్‌ను శుభ్రం చేయడానికి మెత్తని స్పాంజ్ వాడాలి. లేకుంటే, లోపల ఉండే నాన్ స్టిక్ కోటింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

