కలకాలం తిరిగేలా!
ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ఉన్నాయి. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇంత సాంకేతికత లేదు. గుడి గంటో, బడి గంటో విని సమయాన్ని అంచనా వేసేవాళ్లు.
ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు ఉన్నాయి. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఇంత సాంకేతికత లేదు. గుడి గంటో, బడి గంటో విని సమయాన్ని అంచనా వేసేవాళ్లు. పెద్ద నగరాల్లో క్లాక్ టవర్ గంట మోగితేనే కొన్ని పనులు అయ్యేవి. తెలంగాణలో ఒకప్పుడు అలుపెరగకుండా కచ్చితమైన సమయాన్ని చూపిన క్లాక్ టవర్ల గడియారాలు కొన్నేండ్ల పాటు ఆగిపోయాయి. ప్రభుత్వ సహకారంతో ఆ గడియారాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు రమేశ్ స్విస్ వాచ్ గ్యాలరీ అధినేత లక్ష్మణ్ చుగ్గాని.
హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్లో 1860లో ఓ క్లాక్ టవర్‌ను నిర్మించారు. శతాబ్దానికిపైగా సరైన సమయం చూపిన ఆ గడియారం కాలపరీక్షను తట్టుకోలేక ఆగిపోయింది. కొన్ని నెలల కిందటే మళ్లీ ప్రాణం పోసుకుంది. ఇప్పుడు ఆ పురాతన క్లాక్ టవర్లోని గడియారం.. గంట గంటకూ టంచనుగా గంటకొడుతూ తన ఉనికిని చాటుకుంటున్నది. అలాంటి ఎన్నో చారిత్రక గడియారాలకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తిరిగి ప్రాణం పోస్తున్నారు లక్ష్మణ్ చుగ్గాని. జంట నగరాల్లోని క్లాక్ టవర్లను పునరుద్ధరించేందుకు జీహెచ్ఎంసీతో ఒప్పందం చేసుకున్నారు లక్ష్మణ్.
సికింద్రాబాద్ క్లాక్ టవర్ గడియారం సహా తెలుగు రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న క్లాక్ టవర్ గడియారాలకు లక్ష్మణ్ మరమ్మతులు చేశారు. కొన్నిచోట్ల తనే సొంతంగా ఏర్పాటు చేస్తున్నారు. పురాతన గడియారాల మరమ్మతు అంటే, అందులోని ముళ్లు తిరిగేలా చేసిపారేసి ఊరుకోలేదు. నవతరం సాంకేతికతను అందిపుచ్చుకొని సౌరశక్తితో, జీపీఎస్ సాయంతో నడిచేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. పైగా ఈ గడియారాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు సాయంత్రం కాగానే వాటంతట అవే వెలిగేలా, ఉదయం కాగానే అవే ఆరిపోయేలా టెక్నాలజీని జోడిస్తున్నారు.
తండ్రి వారసత్వంగా..
లక్ష్మణ్ చుగ్గాని తండ్రి గులాబ్రాయ్ డి. చుగ్గాని కూడా గడియారాలు రిపేర్ చేసేవారు. 1947లో ఆయన రమేశ్ వాచ్ కంపెనీని నెలకొల్పారు. తండ్రి వారసత్వంగా గడియారాల మరమ్మతులో నైపుణ్యం సాధించారు లక్ష్మణ్. కొన్నాళ్లు హెచ్ఎంటీ కంపెనీలో శిక్షణ తీసుకున్నారు. గడియారాలకు ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌లోనూ కోర్సులు చేశారు. 1978లో తమ వాచ్ కంపెనీ పేరును ‘రమేశ్ వాచ్ స్విస్ గ్యాలరీ’గా మార్చారు. ఇందులో అతిపురాతన గడియారాలు మొదలుకొని నేటి స్మార్ట్ వాచ్‌ల వరకు.. అన్నీ మరమ్మతు చేస్తున్నారు. గడియారాల వర్క్‌షాప్‌లూ నిర్వహిస్తుంటారు లక్ష్మణ్.
వివిధ నగరాల్లో..
తెలంగాణలోని పన్నెండు క్లాక్ టవర్లలోని గడియారాలను పునరుద్ధరించారు లక్ష్మణ్. సికింద్రాబాద్ క్లాక్ టవర్‌తోపాటు మహబూబ్‌నగర్, సుల్తాన్‌బజార్, జేమ్స్ స్ట్రీట్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్ క్లాక్టవర్లలో కదలిక మరచిన గడియారాల ముళ్లకు నడకలు నేర్పారు. ప్రస్తుతం శాలిబండ, మల్కాజిగిరిలోని గడియారాలకు హంగులు అద్దే పనిలోపడ్డారు. ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని గడియారాన్ని ‘గ్లాస్ ఫ్లవర్ క్లాక్’గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ‘రమేశ్వాచ్ స్విస్ గ్యాలరీ’ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని కొన్నిప్రాంతాల్లో క్లాక్ టవర్లు కొత్తగా నిర్మిస్తున్నారు లక్ష్మణ్ చుగ్గాని.
…? రవికుమార్ తోటపల్లి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- big cities
- Clock
- clock tower
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

