హలో..1098!
జార్ఖండ్‌లోని కోడెర్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్సోటియావర్ గ్రామం. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెండ్లి కొడుకు అమ్మాయి మెడలో తాళి కట్టబోతుండగా పోలీసులు వచ్చేశారు.
జార్ఖండ్‌లోని కోడెర్మా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్సోటియావర్ గ్రామం. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెండ్లి కొడుకు అమ్మాయి మెడలో తాళి కట్టబోతుండగా పోలీసులు వచ్చేశారు. పదమూడేండ్ల బాలికకు పెండ్లెలా చేస్తారంటూ.. అమ్మాయి, అబ్బాయి తరఫువారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సోనీ, రింకూ (పేర్లు మార్చాం) చిన్ననాటి స్నేహితులు. ఏడో తరగతి చదువుతున్న రింకూకు 13 ఏండ్ల వయసులోనే పెండ్లి చేయాలని భావించారు తల్లిదండ్రులు. రింకూకేమో బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరిక. తన బాధ సోనీతో చెప్పుకొంది. స్నేహితురాలి కోసం సోనీ రంగంలో దిగింది. పిల్లలకు ఎలాంటి ఆపద వచ్చినా 1098 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎప్పుడో ఉపాధ్యాయులు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ధైర్యం తెచ్చుకుని చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసింది. సిబ్బందితో మాట్లాడింది.
తన స్నేహితురాలి బాధను వివరించింది. పెండ్లి ఏర్పాట్లు పూర్తయి, తాళికట్టే సమయానికి పోలీసుల్ని వెంటబెట్టుకుని వచ్చారు చైల్డ్‌లైన్ అధికారులు. పెండ్లి ఆపించి, వధూవరుల తల్లిదండ్రులను స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశు సంక్షేమ కమిటీ సాయంతో రింకూను స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేర్పించారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న జార్ఖండ్ హైకోర్టు.. బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని, సమాచారం ఇచ్చిన బాలికకు రక్షణ కల్పించాలని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ)ని ఆదేశించింది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

