చెన్నై టు లాస్ ఏంజిల్స్!

సినీ, వినోద రంగాలకు చెందిన ఔత్సాహికులకు హాలీవుడ్ కేంద్రమైన లాస్ ఏంజిల్స్‌లో మకాం వేయాలన్న లక్ష్యం ఉండనే ఉంటుంది. కొందరికి ఆ కల తీరక పోవచ్చు. కొందరికి జీవితకాలం పట్టవచ్చు. విద్యా అయ్యర్ లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఎంతో వేగంగా ఆ లక్ష్యాన్ని ఛేదిస్తారు.
హాలీవుడ్‌లోని కామెడీ విభాగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న యువ కెరటం చెన్నైకి చెందిన విద్యా అయ్యర్. 17 ఏండ్ల వయసునుంచే హాలీవుడ్‌పై గురి పెట్టింది విద్య. కామిక్ విభాగంలో తనదైన శైలిలో నవ్వులు పండిస్తూ కథలు, సీజన్స్, ఎపిసోడ్స్‌కు సంభాషణలు రాస్తున్నది. విద్యా అయ్యర్ ప్రస్తుతం హులు చానెల్లో వచ్చే పాపులర్ యానిమేటెడ్ కామెడీ షో ‘సోలార్ ఆపోజిట్స్’ మూడో సీజన్‌కు మాటలు రాస్తున్నది. ఆపిల్ టీవీలో ప్రసారమయ్యే ‘లిటిల్ వాయిస్’కు, డిస్నీలో విశేష ఆదరణ పొందిన ‘మీరా: రాయల్ డిటెక్టివ్’కు పదునైన సంభాషణలు రాసి మంచిపేరు తెచ్చుకున్నది విద్య. ఇంజినీరింగ్ కాగానే, అయిదు ఫిల్మ్ స్కూళ్లకు దరఖాస్తు చేసింది. తన రచనా శైలిని మెచ్చి అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఇచ్చింది. అలా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విద్యా అయ్యర్, అద్భుతమైన టైమింగ్‌తో కామెడీ సంభాషణలు రాస్తూ హాలీవుడ్ రైటర్‌గా స్థిరపడింది. అంతకు ముందు, 2017లో ‘రక్ష’ అనే షార్ట్‌ఫిల్మ్‌కు మాటలు రాసింది అయ్యర్. ఇది అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అంతర్జాతీయ వేదికలపై ‘ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్నీ’ అందుకుంది. స్విమ్మర్ కావాలనే లక్ష్యం పెట్టుకున్న ఓ యువతి, రుతుస్రావం కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ తాను తీసిన ‘కన్య’ అనే షార్ట్‌ఫిల్మ్ విమర్శకుల మన్ననలు పొందింది. హాలీవుడ్ స్థాయిలో భారతీయ కథలకు ప్రాచుర్యం కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉన్నది విద్యా అయ్యర్.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

