మీరు ఆనందంగా ఎందుకు లేరంటే.. ఈ నాలుగే అసలు కారణాలంట !!
ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవు. కూడు, గూడు, దుస్తులు.. ఇలా మనిషి కనీస అవసరాలు తీరాక కూడా ‘నేను ఆనందంగా ఉన్నాను’ అని చెప్పే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. విద్యాధికులు, ఉద్యోగుల్లోనూ సంతృప్తిగా జీవించే వారి సంఖ్య నూటికీ కోటికీ ఒక్కరులా తయారైంది. దీనికి కారణాలు చాలానే ఉన్నా, నాలుగు కారణాలు మాత్రం ప్రముఖంగా కనిపిస్తాయి. వీటిని గమనిస్తే మన ఆనందాన్ని చెడగొట్టే పనులన్నీ స్వయంకృతాలే అనిపిస్తాయి!
కృతజ్ఞతా భావం లేకపోవడం
మనకు ఎన్నో ఇచ్చిన ప్రపంచంపై కృతజ్ఞతతో లేకపోవడం ఆనందానికి దూరమవడానికి ముఖ్య కారణం. ఏ అవకరం లేని శరీరం, తినడానికి, ఉండటానికి లోటులేకపోవడం లాంటి మంచి విషయాలను పక్కన పెట్టి ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ జీవిస్తుంటారు కొంతమంది. ఒక మంచి కారు, పెద్ద ఇల్లు కొనుక్కుంటేనే సంతోషంగా ఉన్నట్టని భావిస్తారు. అంటే ప్రస్తుతానికి వాళ్ల సంతోషాన్ని ఐదారేండ్లు వాయిదా వేస్తున్నారన్నమాట. పోనీ ఐదేండ్లకు ఇల్లు కొనుక్కున్నా.. అప్పుడు మరో సమస్యను వీళ్లే కనిపెడతారు. ఇది ఒక అంతంలేని ప్రక్రియ. అందుకే ఇలాంటి కోరికల్ని పక్కన పెట్టి ఈ క్షణం మీరు ఆనందించడానికి ఉన్న కారణాల్ని వెతుక్కోండి. అందుకు కారణమైనవాటి పట్ల కృతజ్ఞతతో ఉండండి.
ఇతరులతో పోల్చుకోవడం
మన స్నేహితులతోనో, దగ్గరి బంధువులతోనో పోల్చుకుంటున్నామంటే మనల్ని మనం బాధించుకుంటున్నట్టే. నిజానికి పుట్టిన దగ్గరినుంచీ పోయే దాకా ఏ ఇద్దరి జీవితాలూ ఒకేలా ఉండవు. అలాంటప్పుడు ఒకరు పెద్ద ఉద్యోగంలో ఉన్నారనో, మరొకరికి బోలెడు బంగారం ఉందనో, ఇంకొకరి పిల్లలు పెద్ద బళ్లలో చదువుతున్నారనో ఎందుకు పోల్చుకోవడం. ఈర్ష్య, బాధ ఉన్నచోట సంతోషానికి చోటుండదు. అందుకే మన పరిస్థితులు ఏంటి, మన అర్హతను పెంచుకునేందుకు ఏమి చేయగలం అన్న ఆలోచన చేస్తూ ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.
పర్ఫెక్షన్ పిచ్చి వద్దు
మనం ఏదైనా పనిచేసేటప్పుడు బాగా చేయాలనుకుంటాం. తప్పులేదు. కానీ అది పర్ఫెక్ట్… ఇంతకన్నా ఎవరూ బాగా చేయలేరు.. అని అనిపించుకునేలా చేయాలని కోరుకోవద్దు. ఏ పనైనా ఆసక్తిగా చేయండి. అందుకోసం చేతనైనంత కృషి చేయండి. ఆ పని 100 శాతం అద్భుతంగా రావాలని అనుకోకండి. మీరు దాన్ని పూర్తి చేయడానికి 100 శాతం ప్రయత్నం మాత్రం చేయండి. మీ ప్రయత్నం, కృషి మాత్రమే సంతోషాన్ని ఇస్తాయని గుర్తించండి.
జనంలో కలవండి
టీనేజర్లు, యువతలో సంతోషంగా ఉండేవారి శాతం గణనీయంగా తగ్గిపోతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం శ్రుతి మించిన స్మార్ట్ఫోన్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం. గ్యాడ్జెట్లు వచ్చాక మనుషులు మనుషులతో గడిపే సమయం బాగా తగ్గిపోయింది. మనుషులు ఎంత ఎక్కువ సమయం గ్యాడ్జెట్లతో గడిపితే అంత ఎక్కువగా చిరాకు పడుతున్నారని, ఒత్తిడికి గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వర్చువల్ ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఒకసారి సాధారణ ప్రపంచంలో, మనుషులతో కలవండి. అప్పుడే అసలైన ఆనందాన్ని సొంతం చేసుకోగలరు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

