రికార్డ్ బ్రేక్
‘కుటుంబ నియంత్రణ ఇల్లాలి బాధ్యత’ ఇది చాలామంది మాట. పురిటి నొప్పులూ వాళ్లకే, కాన్పు రాకుండా కత్తెర కోతను భరించాల్సిందీ వాళ్లే! ఈ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించినదే మగవాళ్లకు చేసే వేసెక్టమీ సర్జరీ.
‘కుటుంబ నియంత్రణ ఇల్లాలి బాధ్యత’ ఇది చాలామంది మాట. పురిటి నొప్పులూ వాళ్లకే, కాన్పు రాకుండా కత్తెర కోతను భరించాల్సిందీ వాళ్లే! ఈ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయడానికి ఉద్దేశించినదే మగవాళ్లకు చేసే వేసెక్టమీ సర్జరీ. ఈ చిన్నపాటి శస్త్రచికిత్సతో కుటుంబ నియంత్రణ సాధ్యమని శాస్త్రీయంగా రుజువైనా అందరు మగవాళ్లూ ధైర్యం చేయరు. ఆ సమయంలో ప్రభుత్వ వైద్యుడు యాకూబ్‌పాషా సరికొత్త దారిలో పురుషుల్లో అపోహలు తొలగించారు. రెండున్నర దశాబ్దాలలో 40వేల వేసెక్టమీ ఆపరేషన్లు చేశారు.
యాకూబ్ 1998 నుంచీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణలో చురుగ్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న యాకూబ్ పాషా కృషికి గుర్తింపుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇటీవలే ప్రత్యేక పురస్కారాన్ని ప్రదానం చేసింది. చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1998లో వైద్య అధికారిగా ఉద్యోగంలో చేరారు యాకూబ్. అక్కడే పురుషులకు కోత, కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం నేర్చుకున్నారు. చిట్యాల, మొగుళ్లపల్లి, గీసుగొండ, స్టేషన్ ఘన్పూర్.. పనిచేసిన ప్రతి చోటా లక్ష్యానికి మించి ఆపరేషన్లు చేసేవారు. ఆయన 2013లో అనస్తీషియాలో పీజీ పూర్తిచేశారు. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ కుటుంబ నియంత్రణ క్యాంపులు పెట్టినా ఉత్సాహంగా వెళ్తుంటారు యాకూబ్ పాషా.

వాల్టర్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలో ఉన్న ఓ వస్త్ర పరిశ్రమలో షిప్పింగ్ అసిస్టెంట్‌గా 1938లో ఉద్యోగంలో చేరాడు. అప్పటికి అతని వయసు పదిహేను. నాటినుంచీ అక్కడే కొలువు చేస్తున్నాడు. జీవితం అంటేనే పోరాటం ఇక విశ్రాంతి ఎందుకనే ఉద్దేశంతో రిటైర్మెంట్ కూడా తీసుకోలేదు. ఆయన సుదీర్ఘమైన సర్వీస్ 2019లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
ఆ తర్వాత ప్రతిరోజూ తన రికార్డ్‌ను తానే అధిగమిస్తూ పోతున్నాడు! 1950 ప్రాంతంలో.. వాల్టర్‌ను కంపెనీ సేల్స్ విభాగంలో మేనేజర్‌గా నియమించింది యాజమాన్యం. ఆ బాధ్యతల్లో చేరింది మొదలు వాల్టర్ బ్రెజిల్ అంతా తిరిగాడు. వివిధ ప్రాంతాలు తిరుగుతుండటంతో వాల్టర్‌కు ఉద్యోగంలో ఎప్పటికప్పుడు కొత్త కిక్ దొరికేది. వివిధ సంస్కృతులను చూస్తూ ఉద్యోగ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించసాగాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, మార్పును స్వీకరించడం వల్లే ఇన్నేండ్లు ఉద్యోగం చేయగలిగానని చెబుతాడు వాల్టర్. నిజమే, లెక్కల చిక్కు లన్నీ శరీరానికే. మనసుకు ముదిమి ఎక్కడుంది?
…? పిన్నింటి గోపాల్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

