ప్రతిదానికి ఆలస్యంగానే వెళ్తున్నారా? అయితే ఈ డిజార్డర్ నుంచి ఇలా బయటపడండి
Latecomers | కాలేజి, ఆఫీస్, ఫంక్షన్.. ఎక్కడికైనా సరే, కొంతమంది ఎప్పుడూ ఆలస్యమే. ఆ కార్యక్రమానికి హాజరైన చిట్టచివరి వ్యక్తి మనమే అయినప్పుడు నామోషీగానే అనిపిస్తుంది. ఒత్తిడికి గురవుతాం. ఆ అకారణ ఆలస్యాన్ని అధిగమించడానికి కొన్ని చిట్కాలు..
ఆలస్యం అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. లేట్ కమర్స్.. ప్రతిసారీ ఒక కారణాన్ని వెతుక్కుంటారు. ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిసిట్ లేదా హైపర్ యాక్టివిటీ డిజార్డర్) ఉన్నవాళ్లలో ఈ జాడ్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవేవీ లేకపోయినా కొంతమంది అన్నిచోట్లకూ ఆలస్యం అవుతుంటారు. కొన్ని జాగ్రత్తలతో ఈ ఇబ్బందిని అధిగమించడం సులభమే.
› బయటికి వెళ్లేప్పుడు అవసరమైన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో తాళాల కోసమో, పర్సు కోసమో, కళ్లద్దాల కోసమో, కర్చీఫ్ కోసమో వెతుక్కోవాల్సిన పనుండదు. సమయం కలిసొస్తుంది కూడా.
› రేపు ఫంక్షన్కు వేసుకోవాలనుకున్న దుస్తులు, నగలు కూడా ముందురోజు రాత్రే తీసిపెట్టుకోండి. దుస్తులు, మ్యాచింగ్ దుద్దుల్లాంటివి పెట్టుకుని చూసుకుంటే మరీ మంచిది. తీరా వెళ్లేముందు ఫిట్టింగ్ సరిగా లేదనో, సరైన క్లిప్ దొరకలేదనో గొణుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు.
› బయటికి వెళ్లాలనుకున్నప్పుడు ఫోన్ ముట్టుకోకండి. ఇన్స్టాలో ఇంటరెస్టింగ్ పోస్ట్ వచ్చిందనో, ఫేస్బుక్లో ఎవరికో శుభాకాంక్షలు చెబుదామనో ఒక్క నిమిషం కోసం ఫోన్ ముట్టుకున్నామంటే, అక్కడే గంట సమయం వృథా అవుతుంది.
› వెళ్లాలనుకున్న చోటికి.. అనుకున్న సమయానికన్నా ఇరవై నిమిషాల ముందే చేరిపోండి. ఖాళీ సమయాన్ని పుస్తకం చదువుతూనో, కాఫీ తాగుతూనో సద్వినియోగం చేసుకోవచ్చు.
› బయల్దేరే ముందు పక్కబట్టలు సర్దడం, సోఫా మీద ఉన్న బట్టలు మడతేసి లోపల పెట్టాలనుకోవడం, అప్పుడే తాగిన కాఫీ కప్పును కడిగేయడం.. మరింత ఆలస్యానికి దారితీసే పనులు. ఇల్లు కదలడం కష్టమైనవారే చివరి నిమిషంలో ఇలా చేస్తుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
› పనిమీద వెళ్లే చోటు ఏదో, ఎంత దూరంలో ఉందో, అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో.. ముందుగానే తెలుసుకోండి. దీనివల్ల ఎన్నింటికి బయలుదేరితే సమయానికి చేరుకోగలమనే దానిపై స్పష్టత వస్తుంది. తీరా వెళ్లాక, సారీ చెప్పాల్సిన ఇబ్బందీ తప్పుతుంది.
Read More :
మొటిమలు తగ్గి చర్మం మెరవాలా? అయితే వీటి గురించి తెలుసుకోండి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

