అనగనగా అనలాగ్ లైఫ్!
పొద్దున లేవగానే పక్కనున్న ఫోన్ మోగడం.. కళ్లు తెరవకముందే నోటిఫికేషన్లు స్క్రోల్ చేయడం.. ఆఫీస్‌లో ల్యాప్‌టాప్, మధ్యమధ్యలో వాట్సాప్, రాత్రి పడుకునే ముందు.. ఏదోఒక వెబ్‌సిరీస్! చాలామంది జీవితం ఇప్పుడు కేవలం.. స్వైప్‌లు, ట్యాప్‌ల మధ్యే నలిగిపోతున్నది. ఈ డిజిటల్ ప్రపంచం ఇస్తున్న సౌకర్యం కంటే.. అది కలిగిస్తున్న అలసటే ఎక్కువగా భయపెడుతున్నది.
పొద్దున లేవగానే పక్కనున్న ఫోన్ మోగడం.. కళ్లు తెరవకముందే నోటిఫికేషన్లు స్క్రోల్ చేయడం.. ఆఫీస్‌లో ల్యాప్‌టాప్, మధ్యమధ్యలో వాట్సాప్, రాత్రి పడుకునే ముందు.. ఏదోఒక వెబ్‌సిరీస్! చాలామంది జీవితం ఇప్పుడు కేవలం.. స్వైప్‌లు, ట్యాప్‌ల మధ్యే నలిగిపోతున్నది. ఈ డిజిటల్ ప్రపంచం ఇస్తున్న సౌకర్యం కంటే.. అది కలిగిస్తున్న అలసటే ఎక్కువగా భయపెడుతున్నది. అందుకే 2026లో ఒక కొత్త విప్లవం మొదలైంది. అదే ‘అనలాగ్ లివింగ్’! స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టి.. మన స్పర్శకు స్పందించే, మన కంటికి నేరుగా కనిపించే నిజమైన అనుభూతుల వైపు జనరేషన్ జెడ్ పరుగులు తీస్తున్నది. అసలు ఇంతకీ ఈ ‘అనలాగ్ లివింగ్’ ఏంటి?
అనలాగ్ విప్లవంలో భాగంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ‘అనలాగ్ బ్యాగ్స్’ తెగ ట్రెండ్ అవుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా, ఇవి ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. ఈ బ్యాగుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. మీ స్మార్ట్ ఫోన్‌ని చేతికి అందనంత దూరంలో ఉంచడం. మరి ఫోన్ లేకపోతే బోర్ కొట్టదా!? అంటే.. అక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ బ్యాగులో పెయింటింగ్ కిట్స్, నవలలు, చిన్నపాటి పజిల్స్, డైరీలు, అల్లికల సామాగ్రి ఉంటాయి. ఎక్కడైనా వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫోన్ తీసి ‘డూమ్ స్క్రోలింగ్’ చేయకుండా.. వీటితో కాలక్షేపం చేస్తారన్నమాట. ఇది మన మెదడుకి ఒక రకమైన ప్రశాంతతను ఇస్తుంది.
కాన్సెప్ట్ : ఫోన్‌ని లోపల పెట్టి, చేతికి అందుబాటులో నవలలు, జెంగా గేమ్స్, లెగో సెట్స్ లేదా డైరీలను ఉంచుకోవడం.
లాభం : వెయిటింగ్ రూమ్స్ లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు బోర్ కొడితే ఫోన్ తీయకుండా, వీటితో క్వాలిటీ టైమ్ గడపవచ్చు.
మెదడుకి ఎంత మేలు?
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ఇచ్చే వెలుగు కంటే, మిత్రులతో కలిసి ఆడే లూడో బోర్డు ఇచ్చే ఆనందం చాలా గొప్పది. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ వచ్చే క్విక్ కామర్స్ యాప్స్ మనల్ని బద్ధకస్తులుగా మార్చేస్తున్నాయని భావిస్తూ.. చాలామంది ఇప్పుడు స్వచ్ఛందంగా లోకల్ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్నారు. కూరగాయల కోసం, చిన్నచిన్న వస్తువుల కోసం నేరుగా కిరాణా కొట్టుకు వెళ్లడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం కనిపిస్తుంది, నలుగురితో మాట్లాడతాం. ఇవే మనల్ని ఒత్తిడి నుంచి కాపాడతాయి.
నిరంతరం నోటిఫికేషన్లు, డేటా వెల్లువలో మన నాడీవ్యవస్థ ఎప్పుడూ అలర్ట్‌గా ఉండి అలిసిపోతున్నది. వస్తువులను ఫిజికల్‌గా తాకడం.. అంటే, పుస్తకం పేజీలు తిప్పడం, పెన్‌తో పేపర్ మీద రాయడం వల్ల మన మెదడు ‘ప్రెజెంట్ మూమెంట్’లో ఉంటుంది. ఇది యాంగ్జయిటీని తగ్గించడమే కాకుండా, డిజిటల్ మీడియా దెబ్బతీసిన మన
ఏకాగ్రతను మళ్లీ పునరుద్ధరిస్తుంది.
ప్రెజెంట్ మూమెంట్ : పేపర్ మీద పెన్నుతో రాయడం, ఒక పుస్తకం పేజీలు తిప్పడం వల్ల మెదడు ప్రస్తుతం జరుగుతున్న పనిపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది.
స్ట్రెస్ రిలీఫ్ : నోటిఫికేషన్ల వెల్లువ తగ్గడం వల్ల నాడీవ్యవస్థ
ప్రశాంతంగా ఉంటుంది. ఇది యాంగ్జయిటీని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఎలా మొదలుపెట్టాలి?
అనలాగ్ లివింగ్లోకి మారడం అనేది ఒకేరోజులో జరిగిపోయే పనికాదు. దీనికోసం నిపుణులు కొన్ని సింపుల్ టిప్స్ సూచిస్తున్నారు. రాత్రి పడుకోవడానికి గంట ముందే ఫోన్ ఆపేసే ‘డిజిటల్ సన్‌సెట్’ పాటించడం. ఫోన్లో క్యాలెండర్ బదులు ఒక పేపర్ డైరీలో పనులు రాసుకోవడం, ఎప్పుడూ యూపీఐ పేమెంట్స్ కాకుండా అప్పుడప్పుడూ నగదు వాడటం వంటివి.. మనల్ని మళ్లీ రియల్ వరల్డ్‌కి కనెక్ట్ చేస్తాయి. అల్లికలు, వంట చేయడం, పెయింటింగ్ వంటి కొత్త హాబీలను నేర్చుకోవడం వల్ల.. మనకు మనమే ఒక క్వాలిటీ టైమ్ ఇచ్చుకోగలుగుతాం.
డిజిటల్ సన్‌సెట్ : నిద్రపోవడానికి ఒక గంట ముందే అన్ని స్క్రీన్లను ఆఫ్ చేయండి.
వినైల్/సీడీ మ్యూజిక్ : పాటలను స్కిప్ చేయకుండా వినడం అలవాటు చేసుకోండి.
పేపర్ ప్లానర్ : మీ రోజువారీ పనులను డైరీలో రాసుకోండి.
ఆఫ్‌లైన్ కమ్యూనిటీస్ : బోర్డ్ గేమ్క్లబ్స్, బుక్ రీడింగ్ సెషన్స్‌లో నేరుగా పాల్గొనండి. చివరగా, ‘అనలాగ్ లివింగ్’ అంటే టెక్నాలజీని వదిలేయడం కాదు.. అది మనల్ని పాలించకుండా చూసుకోవడమే! అందుకే, సాంకేతికతతో స్మార్ట్‌గా ఉంటూనే.. ‘అనలాగ్’తో హెల్తీగా జీవించండి!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

