ఆకాశ దీపం అంటే..
‘సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలి’ అని శాస్త్ర వచనం. కార్తిక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది.
దామోదరాయ నభసి తులాయాం దోలయా సహ
ప్రదీపంతే ప్రయచ్ఛామి నమోనంతాయ వేధసే॥
‘సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు దామోదరుడైన విష్ణుమూర్తి కోసం ఆకాశదీపాన్ని వెలిగించాలి’ అని శాస్త్ర వచనం. కార్తిక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత శివాలయాల్లో, వైష్ణవాలయాల్లో ఆకాశదీపం ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. మట్టితో గానీ, లోహంతో గానీ చేసిన చిల్లులు ఉన్న ప్రమిదలో ఆవునెయ్యితో గానీ, నువ్వులనూనెతో గానీ ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. దీనిని ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు. ‘దామోదరమావాహయామి’, ‘త్రయంబకమావాహయామి’ అని శివకేశవులను ఆహ్వానిస్తూ దీపాన్ని వెలిగిస్తారు.
ఈ దీపకాంతులు హరిహరుల తేజస్సును ప్రసరింపజేస్తాయని విశ్వసిస్తారు. కార్తిక మాసంలో ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆకాశదీపాన్ని దర్శించుకొని, దీపాలు వెలిగించిన వారికి జ్ఞానసంపద కలుగుతుందని స్కాంద పురాణ అంతర్గతమైన కార్తిక పురాణం చెబుతున్నది. కార్తిక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలు ఆకాశమార్గంలో తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. వారికి దారి చూపేందుకు వీలుగా ప్రతి గృహస్థూ ఇంటికి దక్షిణ దిశలో దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతున్నది. ఈ దీపాల వెలుగు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని నమ్మకం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

