రిఫ్రిజిరేటర్.. రోజంతా ఆన్‌లోనే ఉంటుంది. మామూలు రోజుల్లోనే కాస్త వేడి అవుతుంది. అలాంటిది వేసవిలో ఫ్రిజ్‌పై భారం మరింత పెరుగుతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ పనితీరు తగ్గడంతోపాటు విద్యుత్ బిల్లు మోగిపోతుంది. దీనిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వేసవిలో ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రతను మూడు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంచాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రత -18 డిగ్రీల సెటీగ్రేడ్ వద్ద ఉంచడం మంచిది. మరీ తక్కువ అయితే.. కంప్రెషర్‌పై భారం పడి,
వినియోగం పెరుగుతుంది.
ఫ్రిడ్జ్ వెనుక ఉండే కూలింగ్ కాయిల్స్పై దుమ్ము పేరుకుపోతే.. వేడి బయటికి వెళ్లదు. అందుకే ఈ కాయిల్స్‌ను బ్రష్, వాక్యూమ్ క్లీనర్‌తో క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి. దీనివల్ల ఫ్రిడ్జ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక కాయిల్స్‌కు గాలి బాగా ఆడేలా.. ఫ్రిడ్జ్‌ను గోడకు కనీసం ఆరు అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల గాలి ప్రసరణ బాగుండి.. కంప్రెషర్ త్వరగా చల్లబడుతుంది.
ఫ్రిడ్జ్ డోర్ చుట్టూ ఉండే రబ్బర్.. బిగుతుగా ఉందో లేదో చూసుకోవాలి. అది వదులైతే లోపలి చల్లదనం బయటికి పోతుంది. దాంతో ఫ్రిడ్జ్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది.
ఫ్రిడ్జ్ మొత్తాన్నీ ఆహార పదార్థాలతో నింపేయొద్దు. అలా చేస్తే ఫ్రిడ్జ్ లోపల ఎయిర్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. దీనివల్ల ఆహారం త్వరగా పాడవ్వడమే కాకుండా, ఫ్రిడ్జ్ కూలింగ్ కూడా తగ్గుతుంది. అందుకే, ఫ్రిడ్జ్‌లో కనీసం 20 శాతం ఖాళీ ఉండేలా చూసుకోవాలి.
ఫ్రీజర్‌లో పేరుకుపోయే ఐస్‌ను క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయాలి. ఎక్కువ ఐస్ ఉంటే.. అది ఇన్సులేటర్‌లా పనిచేసి కూలింగ్‌ను తగ్గిస్తుంది.