అలెక్సా అతివలు

అమెజాన్ రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్ ఏఐ టెక్నాలజీ.. అలెక్సా భారతీయుల జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా మిలీనియల్స్ అలెక్సాను సొంత మనిషిలా చూసుకుంటున్నారు. ఇంటి పనుల్లో సాయం తీసుకోవడంతోపాటు వినోద సాధనంగానూ భావిస్తున్నారు. అనగనగా కథలు చెప్తూ, అడిగిన పాటలను ప్లే చేస్తూ, ఇంట్లోని లైట్లూ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆన్-ఆఫ్ చేస్తూ ..అలెక్సా అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. అలెక్సా ఇంత సక్సెస్ కావడం వెనుక మహిళల పాత్రే ఎక్కువ.
అలెక్సా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టీమ్‌కు సీనియర్ మేనేజర్‌గా స్నేహా మేష్రమ్ పని చేస్తున్నారు. 2019 సెప్టెంబర్‌లో అలెక్సా హిందీ వెర్షన్‌ను తీసుకొచ్చారామె. ఆమె నేతృత్వం లోని బృందం అలెక్సాను హిందీతో పాటు ఇండియన్ ఇంగ్లిష్‌లోనూ ప్రవేశపెట్టింది. ‘నా టీమ్‌లో 37 శాతం మంది మహిళలే. వాళ్లలో ఎక్కువగా టీమ్ లీడర్స్ ఉన్నారు. మేమంతా వైవిధ్యమైన ఆలోచనలతో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం’ అని చెబుతారు స్నేహ. అలాగే అలెక్సాకు సంబంధించి ‘ఇండియా సెంట్రిక్ ఎక్స్‌పీరియెన్స్’ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నారు సాఫ్ట్వేర్ డెవలపర్ రమ్య పూసర్ల. ‘అలెక్సా వాయిస్ సర్వీసెస్ – బిజినెస్ డెవలప్మెంట్ టీమ్’ను లీడ్ చేస్తున్నారు టీనా. దీపా బాలకృష్ణన్, సీమా సోమశేఖర్ కంటెంట్ ప్రోగ్రామ్ మేనేజర్లుగా అలెక్సా ప్రాజెక్టులో కీలక బాధ్యతను పోషిస్తున్నారు. అలెక్సాను ప్రపంచం ‘లెస్స లెస్స’ అని మెచ్చుకుంటున్నదంటే.. ఈ బృందం కృషే కారణమని అమెజాన్ సంస్థ ప్రకటించడం విశేషం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

