హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 27: సమాచారా హక్కుపై ప్రజలకు అహగహన ఎంతో అవసరమని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు గుడిమళ్ల రవికుమార్ సభాధ్యక్షతన జరిగింది. కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఉపయోగపడే ఆయుధం సమాచార హక్కు చట్టం, దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వివరించారు. ప్రస్తుత వ్వవస్ధలో సమస్సలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఇలాంటి సదస్సుల వలన సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.
చాలా సందర్భాల్లో అధికారులకు సమస్యలు వినే ఓపిక లేకపోవడం బాధకరమని ఆయన అన్నారు. సభాధ్యక్షులు గుడిమళ్ల రవికుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యంలో ప్రముఖ పాత్ర పోసిస్తుందని దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సదస్సులో నేరేళ్ల శోభ, శ్రీనివాస్‌కుమార్, ప్రొఫెసర్ జ్యోతిరాణి, కొలురు వెంకన్న, పెద్ద ఆంజనేయులు, నిమ్మల శ్రీనివాస్, కూతురు సత్యనారాయణ, ఎం.రమేష్, మండల పరుషరాములు పాల్గొన్నారు.