బచ్చన్నపేటలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు కేటాయించాలి
బచ్చన్నపేట మండలానికి 2018లో మంజూరైన రెండు మహాత్మా జ్యోతిబా పూలే, తెలంగాణ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను ఇతర ప్రాంతాల నుండి మార్చి, వెంటనే బచ్చన్నపేట మండల కేంద్రంలోనే శాశ్వత భవనాలతో ఏర్పాటు చేయాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగరబోయిన మహేందర్ డిమాండ్ చేశారు.
బచ్చన్నపేట, నవంబర్ 16: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి 2018లో మంజూరైన రెండు మహాత్మా జ్యోతిబా పూలే, తెలంగాణ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను ఇతర ప్రాంతాల నుండి మార్చి, వెంటనే బచ్చన్నపేట మండల కేంద్రంలోనే శాశ్వత భవనాలతో ఏర్పాటు చేయాలని క్లీన్ ఫ్యూచర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగరబోయిన మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండల ప్రజావాణి అధికారికంగా వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ప్రభుత్వ భవనాలు లేవనే సాకుతో బాలుర గురుకులాన్ని జనగామకు, బాలికల గురుకులాన్ని పెంబర్తికి తరలించడం వల్ల స్థానిక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మండల కేంద్రంలో అనువైన ప్రభుత్వ భూతులను గుర్తించి, గురుకులాల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిడిగొండ శ్రీనివాస్, సిరిపాటి అరుణ్ కుమార్, మంగళిపల్లి భాస్కర్, ఆరె మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా.. చిన్ననాటి బ్యాట్ ఫోటోను పోస్టు చేసిన సచిన్
Health tips | మీరు షుగర్ పేషెంటా.. అయితే మీ గుండెను కాపాడుకోండిలా..!
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

