నవంబర్ 5న జేఎన్ఎస్లో జిల్లాస్థాయి యువజనోత్సవాలు
హనుమకొండ జిల్లాలో జిల్లాస్థాయి వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ-2027, జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు (యువజనోత్సవాలు) నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 26: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని 30వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా హనుమకొండ జిల్లాలో జిల్లాస్థాయి వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ-2027, జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు (యువజనోత్సవాలు) నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తెలిపారు.
ఈ పోటీలు 5వ తేదీన గురువారం ఉదయం 9 నుంచి హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 15 నుండి 29 సంవత్సరాలలోపు వయస్సుగల యువతీ యువకుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడంతో పాటు జిల్లా, రాష్ర్ట, జాతీయస్థాయిలలో గుర్తింపు పొందేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు.
ఈ పోటీలలో జానపద నృత్యం (గ్రూపు), జానపద గీతాలు (గ్రూపు), పెయింటింగ్, నుక్కడ్ నాటక్ (వీధి నాటకం), కవిత్వ రచన అనే ఐదు అంశాలలో పోటీలు నిర్వహించబడతాయని, జిల్లా స్థాయిలో ఎంపికైన విజేతలకు రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించబడుతుందన్నారు. రాష్ర్ట స్థాయిలో ఎంపికైన విజేతలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం పొందుతారని, పోటీలలో పాల్గొనదలచిన యువతీ యువకులు తప్పనిసరిగా My Bharat Portal (https://mybharat.gov.in/vbyld-2027)లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
పోటీలు నిర్వహించే తేదీ నాటికి 15 సంవత్సరాలు నిండి, 29 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలని, గత మూడు సంవత్సరాలలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవాలలో పాల్గొన్న వారు లేదా బృందాలు అర్హులు కాదన్నారు. ప్రతి అభ్యర్థి ఒక అంశంలో మాత్రమే పాల్గొనాలన్నారు. పాల్గొనేవారు My Bharat Portal రిజిస్ట్రేషన్ ప్రింట్ అవుట్, ఆధార్ కార్డు ప్రతితో పాటు రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలను పోటీలు జరిగే రోజున రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు కేడీసీ ఎదురుగా ఉన్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో లేదా 7995503018 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

