బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్
బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్త నిఖీ చేశారు.
బచ్చన్నపేట అక్టోబర్ 30 :జనగా జిల్లా బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్త నిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, కేసు ఫైల్స్, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, స్టేషన్ నిర్వహణ, పోలీసుల విధుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. డీసీపీ పోలీస్ సిబ్బందికి విలువైన సలహాలు, సూచనలు అందజేశారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుదారులు, ప్రజల పట్ల మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపరమైన ప్రవర్తనను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఐపీఎస్ మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవేందర్, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
NIMS Raids | నిమ్స్ ఆస్పత్రిలో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు
Killer | ‘కిల్లర్’ మూవీ రివ్యూ.. రూ.కోటి ఛాలెంజ్ విసిరిన సినిమా ఎలా ఉందంటే!
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

