మాచన రఘునందన్ కు అరుదైన గౌరవం.. ఎయిమ్స్ నుంచి ఆహ్వానం
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్వహించనున్న ఓ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని టుబాకో కంట్రోల్ ‘హీరో’ మాచన రఘునందన్ తెలిపారు.
బచ్చన్నపేట, ఆగస్టు 31 : అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్వహించనున్న ఓ సదస్సుకు హాజరు కావాల్సిందిగా తనకు ఆహ్వానం అందిందని టుబాకో కంట్రోల్ ‘హీరో’ మాచన రఘునందన్ తెలిపారు. సెప్టెంబర్ 5న ఏయిమ్స్ లో జరిగే సదస్సుకు హాజరు కావాలని డాక్టర్ దత్తా కోరినట్టు మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం రఘునందన్ బచ్చన్న పేట లో మాట్లాడుతూ..ఏటా రెండు పర్యాయాలు ఎయిమ్స్ నుంచి తనకు ఆహ్వానం వస్తుందని వివరించారు. స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ (SIPHER) వారు టుబాకో కంట్రోల్ హీరో అవార్డుకు తనను ఎంపిక చేసినపుడు.. అందుకు తన అర్హత, యోగ్యత ల తో పాటు.. ఎయిమ్స్ వైద్యులు కూడా నామినేట్ చేశారని చెప్పారు.
దేశ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాల్లో విద్యార్ధులకు పొగాకు నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి వాటిలో తన భాగస్వామ్యం కోసం ఎయిమ్స్ ప్రతిపాదించే అవకాశం ఉందని రఘునందన్ ఆశా భావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో..500 గ్రామాలు పర్యటించి,5000 కిలో మీటర్ల ప్రయాణం ద్వారా 50,000 మందికి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలను వివరించి ‘సే నో టు టుబాకో’ అనేలా చేయగలిగానన్నారు. ఈ అసాధారణ కృషిని గుర్తించి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ సదస్సు కు హాజరు కావాలని సమాచారం పంపిందని తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

