పాపం పసివాడు
కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శ్యామ్రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- గోడను ఢీకొన్న కాంక్రీట్ మిక్సర్ వాహనం
- గోడ కూలి బాలుడి మృతి.. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఘటన
- మహబూబాబాద్ జిల్లాలో విషాదం
మేడిపల్లి, మార్చి 19 : కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై శ్యామ్రాజ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా వడ్డెరగూడెం గ్రామానికి చెందిన సంపంగి సంగీత, శ్రీను దంపతులకు కూతురు నిహారిక (7), కొడుకు గణేశ్ (4) ఉన్నారు. వీరు గత నెల రోజుల నుంచి కరీంనగర్లో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
నాలుగు రోజుల నుంచి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఎన్నమనేని ప్రణవికి చెందిన పౌల్ట్రీ ఫామ్ పనులు చేస్తున్నారు. అదే ఫామ్లో పనిచేస్తున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అమరగోని రాజు అజాక్స్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని అజాగ్రత్తగా రివర్స్ తీయడంతో అది గోడకు తగిలింది. దీంతో ఆ పక్కనే కూర్చున్న సంపంగి గణేశ్పై గోడ కూలడంతో తల నుజ్జునుైజ్జె అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

