నింగికేగిన పాటల చంద్రుడు
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
- గుండెపోటుతో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం
- గుర్రంగూడలోని స్వగృహంలో నివాళులర్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సాయిచంద్‌కు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలో ఫామ్‌హౌస్ ఉంది. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సాయిచంద్ మృతి విషయం తెలిసిన సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర మంత్రులు సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కంటతడి పెట్టారు. సాయిచంద్ మరణవార్త విని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కళాకారులు గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వనస్థలిపురం సాహెబ్ నగర్‌లోని శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. గుర్రంగూడ నుంచి సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర ముందు కళాకారులు ‘సాయిచంద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ పాటలతో ఆయన్ని గుర్తు చేసుకున్నారు.
– సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ)




Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
Protein Idly | ఇడ్లీలను ప్రోటీన్లు ఉండేలా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటాయి..
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

